సిరులను ప్రసాదించే శివుడు
శ్రీమహావిష్ణువు లక్ష్మీవల్లభుడు కనుక అడిగిన వెంటనే ఆయన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడని భక్తులు విశ్వసిస్తుంటారు. ఇక స్మశానంలో తిరుగుతాడు కనుక శివుడు మోక్షాన్ని మాత్రమే ఇస్తాడని అనుకుంటూ ఉంటారు. అయితే శివయ్య మనసు గెలుచుకోవాలే గాని ఆయన కూడా సంపదలను ప్రసాదించడంలో ముందుంటాడని పురాణాలు చెబుతున్నాయి. అలా సిరిసంపదలను అనుగ్రహించే శివుడు 'పెరుమాళ్ల సంకీస'లో దర్శనమిస్తూ ఉంటాడు.
వరంగల్ జిల్లా డోర్నకల్ మండలంలో ఈ క్షేత్రం అలరారుతోంది. శివుడు ఎన్ని ప్రదేశాల్లో ఆవిర్భవించినా ప్రతి క్షేత్రానికి ఒక ప్రత్యేకత వుంటుంది. అలా ఈ క్షేత్రంలో శివయ్యను దర్శించుకుంటే సంపదలను ప్రసాదిస్తాడని చెబుతుంటారు. ఇక్కడి శివాలయం కాకతీయుల కాలంలో నిర్మించినట్టు తెలుస్తోంది. కాకతీయులకు గల శివభక్తికి ఇక్కడి ఆలయం నిలువుటద్దమై కనిపిస్తూ వుంటుంది. మారుమూల ప్రాంతంలో వున్న ఈ క్షేత్ర వైభవం ఇప్పుడిప్పుడే వెలుగుచూస్తోంది.
ఇక్కడి శివుడిని దర్శించుకున్న వాళ్లు దారిద్ర్య బాధల నుంచి విముక్తిని పొందుతారని చెబుతుంటారు. శైవ సంబంధమైన పర్వదినాల్లో శివుడికి ప్రత్యేకపూజలు ... సేవలు నిర్వహిస్తుంటారు. ఇదే గ్రామంలో వందల సంవత్సరాల క్రితంనాటి రామాలయం వుంది. సీతారామలక్ష్మణులతో పాటు భరత శత్రుఘ్నులు కూడా గర్భాలయంలో కొలువై వుండటం ఇక్కడి విశేషం. ఈ కారణంగా ఈ గ్రామం హరిహర క్షేత్రంగా విలసిల్లుతోంది.
వనవాసకాలంలో శ్రీరాముడు అనేక ప్రాంతాల్లో శివలింగాలను ప్రతిష్ఠిస్తూ, శివుడి పట్ల తనకి గల ప్రేమాభిమానాలను చాటుకున్నాడు. రాముడు తనని ప్రతిష్ఠించిన ప్రతిచోట ఆయన పేరుతోనే పూజలు అందుకుంటూ రాముడిపై తనకి గల అనురాగాన్ని చాటుకున్నాడు శివుడు. వీరిద్దరి అనుబంధానికి ప్రతీకగా ఈ దేవాలయాలు అలరారుతున్నాయి. చారిత్రక వైభవాన్ని కలిగిన ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.