పార్వతీదేవి ఈ చెట్టుకిందే కూర్చుందట !
ఉజ్జయిని పేరును ప్రస్తావించని పురాణాలుగానీ ... ఆధ్యాత్మిక గ్రంధాలుగాని కనిపించవు. దేవతలు ప్రత్యక్షంగా కొలువైన దివ్య స్థలంగా ... మహర్షుల తపస్సుతో మరింత పవిత్రమైన పుణ్యస్థలంగా ప్రసిద్ధి చెందిన ఉజ్జయిని, చారిత్రక వైభవాన్ని కూడా సంతరించుకుని కనిపిస్తుంది. ఇక్కడ ఏవైపు చూసినా ఆలయాలు ... మందిరాలే కనిపిస్తూ ఉంటాయి. ప్రతి ప్రదేశం పురాణపరమైన ప్రత్యేకతను కలిగి ఉండటం ఇక్కడి విశేషం. అలాంటి విశిష్టతను కలిగిన ప్రదేశంగా ఇక్కడ 'సిద్ధవటం' కనిపిస్తుంది.
ఉజ్జయిని చేరుకున్న భక్తులు తప్పనిసరిగా ఇక్కడ 'శిప్రానది' తీరంలో గల పెద్ద మర్రిచెట్టును దర్శించుకుంటూ ఉంటారు. పరమశివుడి అనుగ్రహాన్ని కోరుతూ పార్వతీదేవి ఈ చెట్టుకిందనే తపస్సు చేసిందని స్థలపురాణం ద్వారా తెలుస్తోంది. సమస్త లోకాలు తల్లిగా భావించే పార్వతీదేవి కూర్చున్న ప్రదేశాన్ని దర్శించడం కంటే ధన్యమేమున్నది అన్నట్టుగా భక్తులు భారీ సంఖ్యలో ఈ చెట్టును దర్శించుకుంటూ ఉంటారు.
అత్యంత భక్తి శ్రద్ధలతో ఒక చెట్టును దర్శించడం ... అంకిత భావంతో నమస్కరించడాన్ని ఆనాటి హిందూ మతేతరులు భరించలేకపోయారు. భక్తుల మనోభావాలను దెబ్బతీయడం కోసం ఇక్కడి మర్రిచెట్టును కొట్టేశారు. అంతేకాకుండా ఆ చెట్టు ఆనవాళ్లు కూడా అక్కడ లేకుండా చేయడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశారు. అయినా ఆ చెట్టు పెరగకుండా అడ్డుకోలేకపోయారని చెబుతారు. అందువలన ఈ చెట్టు మహిమాన్వితమైనదిగా భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. అమ్మవారు అదృశ్య రూపంలో ఆ చెట్టుకిందనే ఉందని భావించి, భక్తి శ్రద్ధలతో సేవిస్తూ ఉంటారు.