సుదర్శన చక్రాన్ని సరిచేసుకున్న స్వామి !
ఆగమశాస్త్రం ప్రకారం గర్భాలయంలో దైవ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. ఆ క్షణం నుంచి ప్రాణంతో దైవం అక్కడ ప్రత్యక్షంగా ఉందన్న భావనతోనే అన్నిరకాల సేవలను నిర్వహిస్తుంటారు. ఇక స్వయంభువు దైవాల విషయంలో ఈ విశ్వాసం మరింత బలంగా కనిపిస్తూ ఉంటుంది. స్వయంభువుగా ఆవిర్భవించాడు కనుక, స్వామి ఇక్కడ ప్రత్యక్షంగా కొలువై ఉంటాడని చెబుతుంటారు.
స్వయంభువు విగ్రహ స్పర్శలో కూడా తేడా ఉంటుందని అంటారు. తన విషయంలో అపచారం జరిగితే స్వయంభువు స్వామి వెంటనే స్పందిస్తాడని కూడా చెబుతుంటారు. ఇందుకు ఉదాహరణగా 'పెదముక్తేవి' క్షేత్రం దర్శనమిస్తూ ఉంటుంది. పరమ పవిత్రమైనదిగా ... అత్యంత విశిష్టమైనదిగా చెప్పబడుతోన్న ఈ క్షేత్రంలో ప్రధాన దైవంగా 'శ్రీరాజ్యలక్ష్మీ సమేత శ్రీమన్నారాయణుడు' కొలువుదీరి ఉంటాడు.
వ్యాస మహర్షి తపస్సుకు మెచ్చి శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమైన ప్రదేశం ఇది. ఆ మహర్షి అభ్యర్థన మేరకు స్వామి ఇక్కడ స్వయంగా ఆవిర్భవించాడని స్థలపురాణం చెబుతోంది. స్వామివారు చతుర్భుజుడై వివిధ ఆయుధాలను ధరించి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు. స్వామివారి ఆయుధాలలో ప్రధానంగా కనిపించే 'సుదర్శన చక్రం', గతంలో జరిగిన మతపరమైన ఘర్షణల్లో దెబ్బతిందట.
అప్పట్లో కొందరు స్వామివారి విగ్రహాన్ని భిన్నం చేయడానికి ప్రయత్నించారు. వాళ్ల ప్రయత్నం ఫలించకపోవడంతో వెనుదిరిగారు. అయితే ఆ సమయంలో స్వామివారి చేతిలో గల సుదర్శన చక్రం కొంతభాగం దెబ్బతింది. ఆ భాగాన్ని అతుకుపెట్టడం కుదరదు ... అలాగని వదిలేయడానికీ శాస్త్రం అంగీకరించదు. ఇది పూర్తిగా భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం కావడంతో, ఏం చేయాలో అక్కడి వారికి పాలుపోలేదట.
ఇదంతా గమనించిన స్వామి ఏమనుకున్నాడో తెలియదుగానీ, తన సుదర్శన చక్రాన్ని తానే సరిచేసుకున్నాడు. ఒక రోజు ఉదయం ఆలయం తలుపులు తీసిన అర్చకులు స్వామివారి చేతిలో గల సుదర్శన చక్రం పూర్వంలానే యధాతథంగా ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. స్థానికులు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ స్వామివారికి సాష్టాంగ నమస్కారాలు చేశారు. ఈ సంఘటన కారణంగా స్వామి ఇక్కడ ప్రత్యక్షంగా కొలువై ఉన్నాడనే విషయం మాత్రం భక్తులకు స్పష్టమైపోయింది. ఆనాటి నుంచి స్వామివారిని దర్శించేవారి సంఖ్య మరింతగా పెరిగిపోయింది.