సీతారాముల కల్యాణోత్సవం
సీతారాములు అనే పేరులోనే పవిత్రత అనేది అంతర్లీనంగా కనిపిస్తూ ఉంటుంది. అప్రయత్నంగానే ఆ దంపతులకు చేతులు జోడించి నమస్కరించాలనిపిస్తుంది. సీతారాముల ఆలయం లేని ఊరు గానీ, ఆ ఆదర్శమూర్తుల చిత్రపటం లేని ఇల్లుగాని ఉండదనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎలాంటి కష్టనష్టాలు ఎదురైనా దరి చేరేవరకూ నిండుగా ... నిబ్బరంగా ... నిర్మలంగా వాళ్లు తమ జీవన ప్రయాణాన్ని కొనసాగించడమే అందుకు కారణం. అలాంటి సీతారాముల కల్యాణం పెద్దల సమక్షంలో మిథిలా నగరం'లో అంగరంగ వైభవంగా జరుగుతుంది.
జనకమహారాజు చిన్న కూతురైన ఊర్మిళ ఇదే వేదికపై లక్ష్మణుడి జీవితంలోకి అర్థాంగిగా అడుగుపెడుతుంది. జనకమహారాజు సోదరుడైన కుశధ్వజుడికి మాండవీ - శృతకీర్తి అనే ఇద్దరు కూతుళ్లు ఉంటారు. వారిని భరత - శత్రుఘ్నులకు ఇవ్వవలసినదిగా జనకమహారాజు సూచించడంతో ఆయన అందుకు అంగీకరిస్తాడు. ఫలితంగా సఖ్యతకు ప్రతీకగా కనిపించే అన్నదమ్ములకు, సంతృప్తికి మించిన సంపదలేదని భావించే అక్కాచెల్లెళ్లు భార్యలవుతారు.
ఇక దశరథ మహారాజు కుమారులు నలుగురూ ఒకేసారి వివాహం చేసుకుని తమ భార్యలతో అయోధ్యానగరానికి తిరిగి వస్తున్నారని తెలియడంతో అయోధ్యా పురవాసుల సంతోషం అంతా ఇంతా కాదు. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో వేడుక జరుపుకుంటున్నట్టే, తలస్నానం చేసి ... నూతన వస్త్రాలను ధరించి ... ఇంటి ముంగిట ముగ్గులు పెట్టి ... మామిడి తోరణాలు గుమ్మానికి కట్టి ... ద్వారానికి పసుపు కుంకుమలు పెట్టి ... పిండివంటలు చేసుకుంటారు. సంబరంగా వడపప్పు ... పానకాలను పంచుకుంటారు.
ఇక సీతారాములు కుటుంబ సమేతంగా అయోధ్యలోకి ప్రవేశించగానే, అయోధ్యా పురవాసులు వారికి ఆప్యాయంగా స్వాగతం పలుకుతూ అనుసరిస్తారు. ఒకరిని మించి ఒకరు సౌందర్యవంతులుగా కనిపిస్తున్న నలుగురు కొత్త కోడళ్లు ఒకేసారి తమ ఊరుకి రావడం గురించి ముచ్చటించుకుంటారు. తమ ఊహకు తగినట్టుగానే రామయ్యకు తగిన జోడీ దొరికిందనుకుంటూ సంతోషపడిపోతారు. అయితే ఆ తరువాత సీతారాములకు ఎదురైన కష్టనష్టాలు ... వాటిని వాళ్లు సంతోషంగా స్వీకరించిన తీరు ... ధైర్యంతో ఎదుర్కున్న విధానం జనం గుండెలపై చెరగని ముద్రవేసింది.
సీతారాముల ఆదర్శ దాంపత్యం లోకంలో ఎప్పటికీ నిలిచి ఉండాలనే ఉద్దేశంతో ప్రతియేటా వారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతోంది. అప్పట్లో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని చూసి మిథిలా నగరవాసులు తమ జీవితం చరితార్థం చేసుకున్నారు. నూతన వధూవరులుగా అయోధ్యకి వచ్చిన సీతారాములను దర్శించి అయోధ్యా పురవాసులు ధన్యులైనారు. అటు మిథిలానగరవాసులు ... ఇటు అయోధ్యా పురవాసులు పొందిన అనుభూతిని సొంతం చేసుకోవడం కోసం ప్రతి ఒక్కరూ ఆరాటపడుతుంటారు.
ఈ కారణంగానే శ్రీరామనవమి రోజున ప్రతి గ్రామం ఓ మిథిలను తలపిస్తుంది ... ప్రతివాడ ఓ అయోధ్యను గుర్తుకు తెస్తుంది. ఇక సీతారాములు తలంబ్రాలను అక్షింతలుగా తలదాల్చితే సమస్త దోషాలు నశించి, సకల శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. ఇక పెళ్లి కొడుకు తరఫువారిగా ... పెళ్లికూతురు తరఫు వారిగా చదివింపుల కార్యక్రమం ఉంటుంది. దీనిని బట్టి సీతారాములు ప్రజల మనసులకు ఎంత దగ్గరయ్యారో అర్థం చేసుకోవచ్చు.
తీర్థ ప్రసాదాలుగా పానకం - వడపప్పు స్వీకరించామా అంటే, ఆనాటి ఎండవేడిమి నుంచి బయటపడిపోయినట్టేనని భావించాలి. అందరూ కుటుంబ సమేతంగా కలిసి వచ్చి సహపంక్తి భోజనాలు చేయడం చూస్తే, ఈ వేడుక ప్రజల మధ్య సఖ్యతకు ... సమైక్యతకు వేదికలా కనిపిస్తూ ఉంటుంది ... కనువిందు చేస్తూ ఉంటుంది.