భక్తజనుల బంధువు శ్రీరామచంద్రుడు
లోక కల్యాణం కోసం శ్రీమన్నారాయణుడు ధరించిన దశావతారాలలో రామావతారం సాధారణ జనులకు సైతం ఎంతో దగ్గరైంది. అందుకు కారణం ఆయన అనుసరించిన సత్య ధర్మాలే. సత్యం కోసం ... ధర్మం కోసం ... ఆదర్శం కోసం ఆయన సమస్త భోగాలని వదులుకుని అనేక కష్టాలను అనుభవించడమే. రాముడు చెప్పిందే సత్యం ... రాముడు చూపిందే ధర్మం ... రాముడు చేసిందే న్యాయం అని సమస్త జనులు విశ్వసించేలా ఆయన నడచుకున్నాడు.
కులమతాలకు అతీతంగా ... ధనిక బీద తారతమ్యాలు లేకుండా అందరినీ సమానంగా ప్రేమించడం ... సమానధర్మాన్ని ఆచరించడం ఒక్క రాముడికే సాధ్యమైంది. అందుకే ఆయన అందరి మనసులను గెలుచుకున్నాడు. ఇక భక్తుల విషయానికే వస్తే హనుమంతుడితో పాటు అయన ఎంతోమంది భక్తులను అనుగ్రహించిన తీరు ఎంతటివారినైనా కట్టిపడేస్తుంది.
తన భక్తురాలైన 'శబరి' ఎంతోకాలంగా తనకోసం నిరీక్షిస్తుందని తెలిసి ఆమె ఆశ్రమాన్ని వెదుక్కుంటూ రాముడు వెళతాడు. ఆమె రుచి చూసి ఇచ్చిన పండ్లను ఆనందంగా ఆరగించి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఇక ఈ నేపథ్యంలోనే తన భక్తుడైన 'గుహుడు' ను కలుసుకుని, ఆయన పడవెక్కి ముచ్చట తీరుస్తాడు. తన భక్తుడైన 'భద్రుడు'కి ఇచ్చిన మాట మేరకు ఆయనపై సీతాసమేతంగా ఆవిర్భవిస్తాడు.
పోతన అంకితమిచ్చిన భాగవతాన్ని స్వయంగా స్వీకరించి, ఆయన భక్తిని అవహేళన చేసిన వారికి కనువిప్పు కలిగిస్తాడు. త్యాగయ్యకి ద్రోహం తలపెట్టడానికి ఆయన అన్నావదినలు ప్రయత్నించగా, సాక్షాత్తు శ్రీరాముడే దిగివచ్చి ఆయన్ని ఆదుకుంటాడు. ఇక కబీర్ దాసును అంతం చేయడానికి ఢిల్లీ సుల్తాన్ ప్రయత్నించగా, ఆయన బారి నుంచి తన భక్తుడిని రక్షిస్తాడు. తులసీదాసుని సజీవ దహనం చేయడానికి ప్రయత్నించిన వారికి తగిన విధంగా బుద్ధిచెప్పి, తులసీదాస్ ను అనుగ్రహిస్తాడు.
తనకి ఆలయాన్ని నిర్మించి ఆ కారణంగా కారాగారవాసాన్ని అనుభవిస్తోన్న కంచర్ల గోపన్నను లక్ష్మణుడితో కలిసి వెళ్లి విడిపిస్తాడు. ఇలా శ్రీరాముడు తనని ఆరాధించే ఎంతోమంది భక్తులను అనుగ్రహిస్తూ వచ్చాడు. భక్తులకి తానెప్పుడూ బంధువునేననీ ... భక్తుల హృదయాల్లో తానెప్పుడూ బందీనేనని నిరూపిస్తూనే ఉంటాడు.