దీపారాధన
ప్రతి పూజా దేవుడి కోసమే ... ప్రతిఫలం ఆయన అనుగ్రహమే. దేవుడి పూజలో అభిషేకం ... అలంకారం ... ధూప దీప నైవేద్యాలు ... హారతి ప్రధాన పాత్రను పోషిస్తుంటాయి. వీటన్నింటిలో దీపానికి ఓ విశిష్టమైన స్థానం ఉంది. దీపం ... జ్యోతి స్వరూపమైన భగవంతుడిని గుర్తుకుతెస్తుంది. చీకటిని తరిమేసి వెలుగును ప్రసాదిస్తూ, జ్ఞానజ్యోతిని వెలిగించుకుని అజ్ఞానాన్ని తొలగించుకోమంటూ సందేశాన్ని ఇస్తుంది.
ప్రతి పూజా దీపారాధనతోనే మొదలవుతుంది. ఇక సంగీత సాహిత్యాది కార్యక్రమాలు కూడా దీపారాధనతోనే మొదలవుతూ ఉంటాయి. అసలు దీపాన్ని వెలిగించడమే శుభసూచకంగా భావిస్తూ ఉంటారు. పూజా కార్యక్రమాల్లో దీపారాధన చేశాక, దీపాన్ని పూజించిన తరువాతే అసలు పూజలోకి వెళ్లడం జరుగుతూ ఉంటుంది.
దీపాన్ని లక్ష్మీ స్వరూపంగా భావిస్తుంటాం కాబట్టి, ఎప్పుడూ కూడా దీపాన్ని కటిక నేలపై ఉంచకూడదు. ఈ విధంగా చేయడం వలన సంపదలు నశిస్తాయని శాస్త్రం చెబుతోంది. ఇంటిని ... పూజా మందిరాన్ని శుభ్రపరిచి, స్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి ... నిర్మలమైన మనస్సుతో ... పవిత్రమైన భావనతో దీపం వెలిగించాలి. 'ఆవునెయ్యి'తో గానీ ... 'నువ్వులనూనె'తో గాని చేసిన దీపారాధన మంచి ఫలితాలను అందిస్తుందనేది పెద్దలమాట.
ఇక దీపంలో 'ఒక వత్తి' కాకుండా 'రెండు వత్తులు'వేసి వెలిగించాలి. దీపారాధన నేరుగా అగ్గిపుల్లతో చేయకూడదు. అలాగే ఒక ప్రమిదలోని వత్తిని మరో ప్రమిదలోని జ్యోతితో వెలిగించకూడదు. ముందుగా ఒక ప్రమిదలోని వత్తిని వెలిగించి ఆ జ్యోతితో పూజలోని ప్రమిదలను వెలిగించాలని శాస్త్రం చెబుతోంది.
పరిశుభ్రమైన ... పరిశుద్ధమైన ప్రదేశాల్లో ఎక్కడ దీపం వుంటే అక్కడ లక్ష్మీదేవి రూపం వుంటుంది. ఎక్కడ లక్ష్మీదేవి అనుగ్రహం వుంటే అక్కడ సిరిసంపదలు తాండవిస్తాయి. అందువలన మొక్కుబడిగా కాకుండా మనసంతా భక్తిని నింపుకుని చేసిన దీపారాధనకి మంచి ఫలితం ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.