మృతుడికి ప్రాణంపోసిన రామనామం !
తులసీదాస్ తన ఆశ్రమంలో నిరంతర రామనామ సంకీర్తనం చేస్తూ ఉండేవాడు. ఆయన రచించిన 'రామచరిత మానస్' జనం నోళ్లలో నానుతూ ఉండేది. సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడే అది ఆయన నోట పలికించాడని అందరూ అనుకుంటూ ఉండేవాళ్లు. తమపాలిట ప్రత్యక్షదైవంగా ఆయనను గౌరవిస్తూ ఉండేవాళ్లు.
ఒకసారి ఆయన రామనామాన్ని జపిస్తూ వీధిలో వెళుతూ ఉండగా, ఒక స్త్రీ పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన పాదాలపై పడుతుంది. 'దీర్ఘ సుమంగళీ భవ' అంటూ ఆమెను ఆయన దీవిస్తాడు. ఆ మాటకు అక్కడున్న వాళ్లంతా ఆశ్చర్యపోతారు. కొంతసేపటి క్రితమే ఆమె భర్త మరణించిన సంగతి చెబుతారు. మొదటి నుంచి తులసీదాస్ పట్ల ద్వేషాన్ని ప్రదర్శిస్తూ వస్తోన్న రవిదత్తుడు, ఈ సంఘటనను తనకి అనుకూలంగా మార్చుకోవాలనీ, తులసీదాస్ ని అవమానపరచాలని నిర్ణయించుకుంటాడు.
తులసీదాస్ నిజమైన రామభక్తుడే అయితే, చనిపోయిన వ్యక్తిని బతికించి, తన దీవెన నిజం చెయ్యాలంటూ రవిదత్తుడు పట్టుపడతాడు. శ్రీరాముడి నామం మహిమాన్వితమైనదనీ, ఆ నిజాన్ని హనుమంతుడు ఈ లోకానికి ఎప్పుడో చాటిచెప్పాడని అంటాడు తులసీదాస్. ఆ స్త్రీని తన ద్వారా దీవించినది ఆ రాముడేననీ, అదే నిజమైతే ఆమె సౌభాగ్యం నిలుస్తుందంటూ అక్కడే కూర్చుని రామనామం జపించడం మొదలుపెడతాడు.
అలా తులసీదాస్ రామనామం జపిస్తూ ఉండగా, చనిపోయిన వ్యక్తి నిద్రలో నుంచి మెలకువ తెచ్చుకున్నట్టుగా లేచి కూర్చుంటాడు. ఆ దృశ్యం చూసిన వాళ్లంతా తులసీదాస్ పాదాలపై పడతారు. అదంతా శ్రీరామచంద్రుడి అనుగ్రహమనీ, అంకితభావంతో ఆయనని సేవించమని చెబుతాడు తులసీదాస్. ఆయన్ని అవమానపరచాలనుకున్న రవిదత్తుడు, ఆయన కీర్తి ప్రతిష్ఠలు మరింత పెరిగిపోవడం భరించలేక అక్కడి నుంచి విసురుగా వెళ్లిపోతాడు.