అన్నదమ్ములంటే రామలక్ష్మణులే
లోకంలో అసలైన అన్నదమ్ములు ఎవరయ్యా అంటే 'రామలక్ష్మణులే' అనే మాట వినిపిస్తుంది. అన్నదమ్ములుగా వాళ్లు అంతటి ఆదర్శమార్గాన్ని అనుసరించారు. ఇప్పటికీ ఎక్కడైనా ఇద్దరు అన్నదమ్ములు సఖ్యతగా వున్నా, వాళ్లిద్దరూ ఒకరిని వదిలి ఒకరు ఉండలేకపోతున్నా వాళ్లను రామలక్ష్మణులతో పోలుస్తుంటారు. అంతగా రామలక్ష్మణులు ఆదర్శవంతులైన అన్నదమ్ములుగా లోకాన్ని ప్రభావితం చేశారు.
14 సంవత్సరాల పాటు తన భార్యను వదిలి ఉండటానికి సిద్ధపడి, రాముడి వెంట లక్ష్మణుడు అడవులకు బయలుదేరడమనేది సామాన్యమైన విషయం కాదు. భోగభాగ్యాలకు దూరమై కారడవులలో కాలినడకన ప్రయాణించడమనేది అంతతేలికైన విషయమూ కాదు. అయినా తన అన్నయ్య కోసం ఆ కష్టాలను లక్ష్మణుడు ఇష్టంగా అనుభవించాడు.
సీతమ్మవారి నగలను గుర్తించమని రాముడు కోరినప్పుడు, ఆమె కాలి పట్టీలను మాత్రమే లక్ష్మణుడు గుర్తిస్తాడు. మిగతా నగల గురించి రాముడు అడిగితే, తాను ఆమె పాదాలను మాత్రమే చూసేవాడినని చెబుతాడు. అంతటి సంస్కారం ఎంతటివారినైనా ఆశ్చర్యచకితులను చేస్తుంది. వనవాసకాలంలో సీతారాముల ఏకాగ్రతకు భంగం కలగకుండా, వారి నిద్రాహారాలకు ఎలాంటి లోటు రానీయకుండా లక్ష్మణుడు తగిన ఏర్పాట్లు చేస్తూ వస్తాడు.
ఇక మేఘనాథుడితో యుద్ధానికి తలపడిన లక్ష్మణుడు, ఆయన మాయా యుద్ధానికి తాళలేక యుద్ధరంగంలో కుప్పకూలిపోతాడు. అప్పటి వరకూ లక్ష్మణుడి పై గల ప్రేమను మనసులో దాచుకుంటూ వచ్చిన రాముడు ఒక్కసారిగా ఇక్కడ బయటపడిపోతాడు. లోకంలో లక్ష్మణుడి వంటి సోదరుడు మరొకరు ఉండరంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. నిరంతరం తన క్షేమం గురించి ఆలోచించిన లక్ష్మణుడిని నిస్తేజంగా చూడలేకపోతున్నానంటూ దుఃఖిస్తాడు.
హనుమంతుడు 'సంజీవిని' తెచ్చి లక్ష్మణుడిని ఈ లోకంలోకి తీసుకువచ్చేంత వరకూ రాముడు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా తల్లడిల్లిపోతాడు. అన్నదమ్ములు సఖ్యతగా వుంటే వంశ కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయనీ, ఎలాంటి సమస్యలనైనా ఎదిరించి విజయాలు సాధించవచ్చని రామలక్ష్మణులు నిరూపించారు. ప్రేమానురాగాలకు ప్రతీకగా ... సఖ్యతకు సరిహద్దుగా నిలిచిపోయారు.