పుణ్యఫలాలు

పుణ్యఫలాలు
దైవ దర్శనానికి వెళుతూ ఉత్త చేతులతో వెళ్లకూడదనేది పెద్దలమాట. ఇక దేవాలయానికి వెళ్లి పూజ చేయిస్తాం కాబట్టి, స్వామి వారికి నైవేద్యం తీసుకు వెళుతుండటమనేది ఒక నియమంగా వస్తోంది. ముఖ్యంగా స్వామివారికి నైవేద్యం అనగానే అందరికీ వెంటనే గుర్తుకువచ్చేది కొబ్బరి కాయ - అరటి పండ్లు. ఎన్ని రకాల పండ్లు ఉన్నప్పటికీ నైవేద్యానికి సంబంధించి తొలి ప్రాధాన్యత వీటికే దక్కుతుంది.

ప్రాచీన కాలం నుంచి నేటి వరకూ వీటికే అగ్ర తాంబూలం లభించడం వెనుక కారణం లేకపోలేదు. ఇవి అన్ని కాలాల్లోను లభించడం ఒక కారణమైతే, ఆరోగ్య పరంగా ఈ పండ్లు చేసే మేలు మరో కారణమని చెప్పవచ్చు. కొబ్బరి పాలు తల్లి పాలంతటి శ్రేష్టమైనవిగా చెప్పబడ్డాయి. ఇక అరటి పండ్లు రోజుకి రెండు తింటే ఎలాంటి అనారోగ్యాలు దరిచేరవని ప్రముఖ వైద్యులెందరో సెలవిచ్చారు.

ఈ రెండు ఫలములకు ఎన్నో ఔషధ గుణములు వుండటం వల్లనే మన పూర్వీకులు ఈ పండ్లకు ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చారనీ ... ఇటు దైవ కార్యాలతో పాటు, అటు శుభకార్యాలలోను వీటికి ప్రధాన స్థానాన్ని ... ప్రధమ స్థానాన్ని ఇచ్చినట్టుగా అర్థమవుతోంది.

More Bhakti Articles