సత్యభామతో శ్రీకృష్ణుడు ఇక్కడికి వచ్చాడట !
సీతారాములు సుధీర్గకాలంపాటు వనవాసం చేశారు. అందువలన ఈ సమయంలో వాళ్లు అనేక ప్రదేశాలను దర్శిస్తూ వెళ్లారు. ఈ కారణంగా ఎక్కడికి వెళ్లినా అక్కడ సీతారాములకు సంబంధించిన ఏదో ఒక ఆనవాలు కనిపిస్తూనే ఉంటుంది. ఇక శ్రీకృష్ణుడి విషయానికే వస్తే, లోక కల్యాణం కోసం ఆయన ప్రదర్శించిన లీలావిశేషాలు వేరు. ఆయన సత్యభామ - రుక్మిణిలతో కలిసి సంచరించిన ప్రదేశాలు పెద్దగా కనిపించవు.
ఇక సత్యభామను ఆయన దగ్గరుండి మరీ తీసుకెళ్లింది నరకాసుర సంహారానికే అని కూడా చెప్పుకుంటూ ఉంటారు. నిజంగానే లోక కంటకుడైన నరకుడి మరణం, సత్యభామ చేతిలోనే రాసిపెట్టివుంది. అందువల్లనే శ్రీకృష్ణుడు ఆమెను తీసుకుని యుద్ధరంగానికి వెళ్లడం జరిగింది. అదిగో అలా ఆయన సత్యభామను వెంటబెట్టుకుని వచ్చిన ప్రదేశమే 'నడకుదురు' అని చెప్పుకుంటారు. కృష్ణా జిల్లా చల్లపల్లి మండలంలో ఈ ప్రదేశం వుంది.
నరకుడు ప్రభావితం చేసిన ప్రదేశం కనుక 'నరకుదురు' గా వెలుగొంది, కాలక్రమంలో నడకుదురుగా మార్పుకు లోనైందని చెబుతుంటారు. దీపావళి పండుగ జరుపుకోవడానికి కారణమైన నరకాసుర వధ ఈ ప్రదేశంలోనే జరిగిందని స్థలపురాణం చెబుతోంది. ఇక దేవలోకంలో గల పాటలీ పుష్పాల ప్రత్యేకత గురించిన ప్రస్తావన పురాణ సంబంధమైన కథనాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఆ పాటలీ పుష్పాలు గల వృక్షాలు ఈ ప్రదేశంలో ఎక్కువగా కనిపిస్తుంటాయి.
దేవలోకం నుంచి వస్తూ శ్రీకృష్ణుడు వీటిని తీసుకు వచ్చి ఇక్కడ నాటాడని చెప్పుకుంటూ ఉంటారు. ఈ చుట్టుపక్కల ఎక్కడా మచ్చుకి కూడా కనిపించని ఈ వృక్షాలు ఇక్కడ మాత్రమే ఉండటం ఇక్కడి స్థలపురాణానికి మరింత బలాన్ని ఇస్తోంది. లోక కల్యాణానికి వేదికగా నిలించిన ఈ క్షేత్రాన్ని దర్శించడం ఒక అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.