అనుగ్రహమే తప్ప ఆగ్రహం తెలియని రాముడు
శ్రీరాముడి జీవితాన్ని పరిశీలిస్తే ఆయనకి అనుగ్రహించడమే తప్ప ఆగ్రహించడం తెలియదనే విషయం బోధపడుతుంది. ఆగ్రహించవలసిన సందర్భాలు వచ్చినా, ఆ సమయంలో తన భావమేమిటో ప్రశాంతంగా ... సూటిగా మాత్రమే చెప్పేవాడు. అంతేగాని అతి ఆవేశంతో ఆయన ఊగిపోయిన సందర్భాలు ఎక్కడా కనిపించవు. సకల విద్యలు నేర్చినప్పటికీ సహనం ... శాంతం సహజమైన అలంకారాలుగా చేసుకుని కనిపించేవాడు.
తనని అడవులకి పంపించడానికి సిద్ధపడిన కైకేయి పట్ల కూడా ఆయన ద్వేషభావం చూపలేదు. అలాగే తన భార్యను అపహరించిన రావణాసురుడి పట్ల కూడా ఆయన ద్వేష భావం చూపలేదు. తప్పు తెలుసుకుని దానిని దిద్దుకోమని మాత్రమే చెబుతాడు. యుద్ధరంగంలో నిస్సహాయంగా నిలబడిన రావణుడిని ఆవేశంతో అంతం చేయకుండా, మరోసారి ఆలోచించుకోవడానికి సమయం ఇస్తాడు.
అలాగే సీతను రావణుడు తీసుకెళ్లిన దిశను గురించి చెప్పిన జటాయువు పక్షి నుంచి, సీత జాడ తెలుసుకోవడానికి తనకి సహకరించిన ప్రతి ఒక్కరినీ శ్రీరాముడు అనుగ్రహించిన విషయం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. రావణుడు సంహరించబడిన తరువాత, సీతను వెంటబెట్టుకుని అయోధ్యకి బయలుదేరడానికి రాముడు సిద్ధమవుతాడు. ఆ సమయంలో భరతుడు అయోధ్యను పరిపాలిస్తున్నాడు.
రాజ్యాధికారంపట్ల భరతుడి మనసులో ఎలాంటి మార్పు వచ్చిందో రాముడికి తెలియదు. అందువలన తాను అయోధ్యకి తిరిగిరావడం వలన భరతుడు బాధపడతాడేమోనని రాముడు ఆలోచిస్తాడు. తను అయోధ్యకి తిరిగి రావడం భరతుడికి సంతోషకరమైన వార్తేనని తెలుసుకుని అప్పుడు అయోధ్య నగరంలోకి ప్రవేశిస్తాడు. శ్రీరాముడి ఉన్నతమైన వ్యక్తిత్వానికి ఉదాహరణగా చెప్పుకోవడానికి ఈ ఒక్క విషయం సరిపోతుంది. అందుకే అయోధ్య రాముడు అందరివాడయ్యాడు ... అవనిలో అడుగడునా దర్శనమిచ్చే దేవుడయ్యాడు.