భక్తులకు ప్రకృతి ప్రసాదించే తీర్థం
సాధారణంగా ఆలయానికి వెళ్లిన భక్తులు దైవదర్శనం కాగానే తీర్థ ప్రసాదాలపై దృష్టి పెడుతుంటారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించినప్పుడే ఆలయానికి వచ్చిన పూర్తి ప్రయోజనం నెరవేరుతుందని విశ్వసిస్తూ ఉంటారు. క్షేత్రం ఏదైనా అక్కడ సహజ సిద్ధంగా లభించే నీటిలో యాలకులు ... లవంగాలు ... తులసి కలిపి తీర్థంగా ఇస్తుంటారు.
క్షేత్రాల్లో దైవ సంకల్పం కారణంగా ఏర్పడటం వలన ... దైవ సన్నిధిలో ఏర్పడటం వలన అక్కడి నీటికి పవిత్రత సిద్ధిస్తూ ఉంటుంది. ఈ నీటిని తీర్థంగా స్వీకరించడం వలన అనేక వ్యాధులు నశిస్తాయని భక్తులు నమ్ముతుంటారు. అయితే అర్చకులు తయారు చేయకుండా ప్రకృతే భక్తులకు తీర్థాన్ని ప్రసాదించే క్షేత్రం మనకి నిజామాబాద్ జిల్లా 'తొర్లికొండ'లో కనిపిస్తుంది. ఇక్కడ కొండ ప్రాంతంలో శ్రీవేంకటేశ్వరుడు ఆవిర్భవించి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు.
ఇక్కడి కొండరాళ్ల మధ్య నుంచి అదే పనిగా నీళ్లు వస్తుంటాయి. స్వచ్చంగా ... రుచిగా ఉండే ఈ నీరు ఎక్కడి నుంచి ఎలా వస్తున్నదీ ఎవరికీ తెలియదు. ఇలా ధారగా వచ్చే ఈ నీటినే భక్తులు తీర్థంగా స్వీకరిస్తుంటారు. భగవంతుడు ప్రకృతి ద్వారా ప్రసాదించిన ఈ తీర్థం సేవించడం వలన, అనారోగ్యాలు తొలగిపోతాయని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు. గర్భాలయంలో స్వామివారి మూలమూర్తి పరిమాణం రీత్యా చిన్నగానే కనిపించినా, మహిమాన్వితుడని చెబుతుంటారు.
ప్రాచీనకాలం నుంచి ఇక్కడ కొలువుదీరి ఉన్న వేంకటేశ్వరస్వామి ఘనచరిత్రను గురించీ, ఆశ్చర్యచకితులను చేసే ఆయన మహిమలను గురించి భక్తులు కథలుకథలుగా చెప్పుకుంటూ ఉంటారు. హనుమంతుడు క్షేత్రపాలకుడిగా వ్యవహరిస్తోన్న ఈ క్షేత్రానికి, పర్వదినాల సమయంలో భక్తులు ఎక్కువగా వస్తుంటారు. తమ శక్తిమేర స్వామికి కానుకలు ... మొక్కుబడులు చెల్లించుకుంటూ ఉంటారు.