సరయూ నది స్నాన ఫలితం
సరయూ నది పేరు వినగానే శ్రీరామచంద్రుడు దేహ త్యాగం చేసిన సంఘటన కళ్ల ముందల కదలాడుతుంది. శ్రీరాముడి జీవితాన్ని చాలా దగ్గర నుంచి చూసినది సరయూనది. పవిత్రంగా ... ప్రశాంతంగా సాగిపోయే ఆ నది అంటే రాముడికి ఎంతో ఇష్టం. సరయూ నదిని దగ్గరగా చూస్తే నిర్మలత్వాన్నీ ... గంభీరతను దాని నుంచే శ్రీరాముడు గ్రహించి ఉంటాడని అనిపిస్తుంది. బ్రహ్మదేవుడు జలరూపంలో సరయూనదిగా ఇక్కడ ప్రవహిస్తూ ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి.
అలాంటి సరయూ నది నేటికీ శ్రీరాముడితో తనకి గల జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ ముందుకు సాగిపోతూ ఉంటుంది. శ్రీరాముడి బాల్యక్రీడలను చూసి సరయూ నది మురిసిపోయేది ... ఆయన పాదస్పర్శతో పరవశించిపోయేది. శ్రీరాముడు అడవులకి వెళుతున్నప్పుడు అది తన కన్నీటిని కలుపుకుంటూ ప్రవహించింది. ఆయన సీతాదేవితో కలిసి వనవాసం నుంచి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు, ఆనంద బాష్పాలతో అది మరింత విశాలమై ప్రవహించింది.
ఇలా శ్రీరాముడి పై అపరిమితమైన ప్రేమను రాగాలను పెంచుకున్న సరయూ నది అనేక మార్లు ఆయన కోసం భావోద్వేగాలకు లోనైంది. శ్రీరాముడి ఎడబాటును భరించలేనంతగా అది ప్రేమను పెంచుకోవడం వల్లనే ఆయన ఆ నదిలో దేహత్యాగం చేశాడు. లోకంలో ధర్మమార్గాన్ని పటిష్ఠ పరచడానికీ, లోక కల్యాణం కోసం రావణసంహారం చేయడానికి శ్రీరాముడిగా విష్ణుమూర్తి అవతరించాడు. సీతాదేవిగా అవతరించిన లక్ష్మీదేవి పతివ్రతా ధర్మాన్ని లోకానికి చాటిచెప్పింది. ఆ అవతార కార్యం పరిసమాప్తికాగానే, శ్రీరాముడు సరయూ నదిలో దేహత్యాగం చేశాడు.
ఈ కారణంగానే ఈ నది మరింత పుణ్యప్రదమైనదిగా భక్తులు భావిస్తుంటారు. ఈ నదిలో స్నానమాచరించడం వలన సమస్త దోషాలు తొలగిపోతాయని విశ్వసిస్తుంటారు. వేల సంవత్సరాల పాటు కాశీ నగరంలో నివసించడం వలన ... వేల సంవత్సరాలపాటు గంగానదిలో స్నానం ఆచరించడం వలన కలిగే పుణ్య ఫలితం, సరయూనదిని దర్శించినంత మాత్రాన్నే కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. అంతటి విశిష్టతను సంతరించుకున్న సరయూనదిలో స్నానమాచరించడం వలన కలిగే పుణ్యఫలితం గురించి వేరే చెప్పాలా !