శ్రీరాముడు కొలువుదీరిన విశిష్ట క్షేత్రాలు
రామ నామం మధురమైనది ... రాముడి రూపం మనోహరమైనది ... రాముడి మాట ఆచరించదగినది ... రాముడి మార్గం అనుసరించదగినదని ప్రతి ఒక్కరూ భావిస్తుంటారు. నారాయణుడి అవతారంగా చెప్పబడుతోన్న శ్రీరాముడు, ధర్మ మార్గాన్ని అనుసరిస్తూ భారతదేశాన్ని ఎంతగానో ప్రభావితం చేశాడు.
భారతదేశంలో ఏ మూలకి వెళ్లినా అక్కడ ఏదో ఒక రూపంలో రామాయణ కాలంనాటి ఆనవాళ్లు కనిపిస్తుంటాయి. శ్రీరాముడు నడయాడిన ప్రదేశాలు ... విశ్రాంతి తీసుకున్న ప్రదేశాలు ... స్నానం చేసిన జలాశయాలు ... ఆయన కూర్చున్న శిలా పీఠాలు ... ఇలా అక్కడి ప్రదేశాలు పవిత్రతను సంతరించుకుని కనిపిస్తుంటాయి.
శ్రీరాముడు ఎక్కడ అడుగుపెడితే అక్కడ పవిత్రత ... ప్రశాంతత నెలకొంటాయా అన్నట్టుగా ఆ ప్రదేశాలు నేటికీ ఆహ్లాదకరంగా అలరారుతున్నాయి. అక్కడి కొండకోనలు ... పిల్లగాలులు ... వాగులు ... నదులు అన్నీ కూడా రాముడి గొప్పతనాన్ని గురించి చెబుతున్నట్టుగా అనిపిస్తాయి. ప్రతి గ్రామంలో ఓ రామాలయం ఉన్నప్పటికీ, ప్రతి హృదయంలో రాముడు వెలుగొందుతున్నప్పటికీ ఆయన ప్రభావితం చేబడిన కొన్ని క్షేత్రాలు అత్యంత విశిష్టమైనవిగా చెప్పబడుతున్నాయి.
అయోధ్య .. మిథిల .. నాసిక్ .. శ్రీరంగం .. దర్భశయనం .. తిరుపతి .. భద్రగిరి .. తిరుప్పల్ నొడి .. తిరువళ్లూరు .. హంపి .. చిత్రకూటం .. పర్ణశాల .. పంపా .. కిష్కింద .. పంచవటి .. మధురాంతకం .. రామతీర్థం .. గంధమాదనం .. రామగిరి .. యమునాతీరం .. లక్ష్మణపురం .. ఒంటిమెట్ట .. నందిగ్రామం .. జీడికల్లు ఈ జాబితాలో కనిపిస్తాయి. శ్రీరాముడి చల్లని చూపులు సోకి పవిత్రతను సంతరించుకున్న ఈ క్షేత్రాల్లో అడుగుపెట్టడం వల్లనే జన్మజన్మల పాపాలు నశిస్తాయనీ, విశేషమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయని అంటారు.