జీవితాన్ని మలుపుతిప్పిన ముక్కుపుల్ల !
జీవితంలో ఒక్కొక్కరికి ఒక్కోవిషయం పట్ల వ్యామోహం ఉంటుంది. కొందరికి ధనంపట్ల .. మరికొందరికి భార్యపట్ల ... ఇంకొందరికి పిల్లలపట్ల వ్యామోహం ఉంటూ వుంటుంది. అయితే ఇవన్నీ అశాశ్వతాలనీ ... తన అనుగ్రహమే శాశ్వతమని భగవంతుడు అనేకమంది విషయంలో స్పష్టం చేశాడు. అలాంటి వారిలో ఒకడిగా 'పురందరదాసు' కనిపిస్తాడు. పురందరదాసుకి జ్ఞానోదయం కాకముందు ఆయన తాకట్టు వ్యాపారం చేస్తూ ఉండేవాడు. దానగుణమనేది ఆయనలో మచ్చుకి కూడా కనిపించేది కాదు.
ఒకసారి ఆయనను పరీక్షించడానికి వేంకటేశ్వరస్వామి ఓ పేద బ్రాహ్మణుడి వేషంలో వస్తాడు. తన కొడుక్కి ఉపనయనం చేయాలనుకుంటున్నాననీ, ఆర్ధిక సాయం చేయమని కోరతాడు. అందుకు పురందరదాసు నిరాకరించడంతో, స్వామి నేరుగా పురందరదాసు ఇంటికి వెళ్లి ఆయన భార్యను కలుసుకుంటాడు. ఆయనకి ఆర్ధికంగా సాయపడటం కోసం ఆమె ఖరీదైన తన ముక్కుపుల్లను దానం చేస్తుంది.
వేంకటేశ్వరస్వామి మరో వేషంలో పురందరదాసు దుకాణానికి వెళ్లి ఆ ముక్కుపుల్లను తాకట్టుకి ఇస్తాడు. తన భార్య ముక్కుపుల్లను మరో వ్యక్తి తాకట్టుకి తీసుకురావడం చూసి ఆయన ఆశ్చర్యపోతాడు. ఆ ముక్కుపుల్లను తన కండువాలో కట్టుకుని, విషయమేవిటో తెలుసుకునేందుకు ఆగ్రహావేశాలతో ఇంటికి వెళతాడు. మహా లోభియైన తన భర్త ముక్కుపుల్లను గురించి నిలదీస్తాడని భయపడిన సరస్వతీ బాయి, ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటుంది. ఆమె ప్రయత్నానికి పాండురంగడు అడ్డుపడి ఆ ముక్కుపుల్లను ఇస్తాడు.
ఇంట్లో అడుగుపెడుతూనే ముక్కుపుల్లతో ఎదురొచ్చిన భార్యను చూసి పురందరదాసు నివ్వెరపోతాడు. ఆ ముక్కుపుల్ల ఎలా వచ్చిందంటూ తన కండువా విప్పి చూస్తాడు. అందులో ముక్కుపుల్ల లేకపోవడం చూసి బిత్తరపోతాడు. ఓ పేద బ్రాహ్మణుడు దానం కోసం వచ్చిన విషయాన్నీ, దానిని పాండురంగడు తిరిగి తనకి ఇచ్చిన సంగతిని ఆమె అప్పుడు భర్తతో చెబుతుంది. ఆ వచ్చినది సాక్షాత్తు శ్రీనివాసుడేననే విషయం పురందరదాసుకి అర్థమవుతుంది. ఇచ్చేది భగవంతుడే ... తీసుకునేది ఆయనే అనే సత్యం పురందరదాసుకి బోధపడుతుంది.
అనేక భ్రమలకు గురిచేసే ధన వ్యామోహానికి దూరంగా ఉన్నప్పుడే భగవంతుడిని చేరుకునే మార్గం కనిపిస్తుందని అనుకుంటాడు. తనలో మార్పురావడం కోసమే భగవంతుడు అలా నాటకమాడాడని గ్రహిస్తాడు. ఆ క్షణమే సమస్త సంపదలను వదిలి భగవంతుడి సేవకు తన జీవితాన్ని అంకితం చేస్తాడు.