ఉదయం నిద్రలేవగానే ఎవరి ముఖం చూడాలి ?
''ఉదయం నిద్రలేవగానే ఎవడి ముఖం చూశానో ఏంటో !'' అనే మాటను చాలాసార్లు వింటూ ఉంటాం ... అంటూ ఉంటాం కూడా. సాధారణంగా ఏదైనా ఒక అత్యవసరమైన పని అవుతుందని అనుకున్నప్పుడు, చివరి నిముషంలో ఆ పని కానప్పుడు ఇలా అనుకోవడం జరుగుతుంటుంది. నిజానికి పొద్దున్నే నిద్రలేచినప్పుడు చూసిన ముఖానికి ... ఇక్కడ ఈ పని ఆగిపోవడానికి ఏమైనా సంబంధం ఉంటుందా అంటే, ఎవరి నమ్మకాలు వారివనే చెప్పాలి.
ఈ విషయానికి ... శకునాలకి చాలా దగ్గర సంబంధం ఉందనిపిస్తుంది. శుభకార్యాల నిమిత్తం ఎక్కడికైనా బయలుదేరుతున్నప్పుడు బయటివాళ్లు ఎవరైనా ఎదురొస్తే ఏవవుతుందోనని, తమ కుటుంబసభ్యులనే ఎదురురమ్మంటూ ఉంటారు. ఇదే విధంగా ఉదయం నిద్రలేవగానే తమ కుటుంబసభ్యుల్లో తమకి మరింత ప్రేమగలిగిన వారిని పిలిచిమరీ వారి ముఖం చూడటం జరుగుతుంటుంది.
ప్రాచీనకాలంలోకి వెళితే ఉదయం నిద్రలేవగానే ఆవునుగానీ ... అద్దాన్నిగాని ... తల్లిదండ్రులనుగాని ... భార్యనుగాని చూడటం ఒక ఆచారంగా కనిపిస్తుంది. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఈ ఆచారం కొనసాగుతోంది. అయితే పూర్వీకులు ఈ ఆచారాన్ని పాటించడం వెనుక కారణం లేకపోలేదు. 'అద్దం' లక్ష్మీదేవి నివాస స్థానంగా చెప్పబడుతోంది. ఈ కారణంగా ఉదయాన్నే అద్దం చూడటం వలన లక్ష్మీదేవి మోమును చూసినట్టు అవుతుంది.
ఇక ఆవు సకలదేవతా స్వరూపమని సర్వ శాస్త్రాలు చెబుతున్నాయి కనుక, ఆవును చూడటం వలన సమస్త దేవతలను దర్శించినట్టు అవుతుంది. ఇక అర్థాంగి ఎప్పుడూ కూడా తన భర్త శ్రేయస్సునే కోరుకుంటుంది. ఆయన కోసమే వ్రతాలు ... నోములు చేస్తూ ఉంటుంది. అందువలన ఇంటికి దీపంలాంటి ఇల్లాలి ముఖాన్ని చూడటం వలన అంతా మంచే జరుగుతుందని అంటారు.
ఇక మమతలే తప్ప మహిమలు ఎరుగని దేవుళ్లు ... అమ్మానాన్నలు. అలాంటి అమ్మానాన్నలు తాము ఎలా ఉన్నా తమ బిడ్డలు సంతోషంగా ... క్షేమంగా ఉండాలని నిరంతరం కోరుకుంటూ ఉంటారు. ఉదయాన్నే వారిని చూడటం వలన లక్ష్మీనారాయణులను ... శివపార్వతులను దర్శించిన ఫలితం కలుగుతుందని భావిస్తుంటారు.