శ్రీరామకుండం ప్రత్యేకత ఏమిటి ?
భారతీయుల ఆధ్యాత్మిక జీవన స్రవంతిలో సీతారాములు ప్రధాన దైవాలుగా దర్శనమిస్తూ ఉంటారు. ధర్మానికి ప్రతీకగా నిలిచిన శ్రీరాముడినీ, ఆదర్శానికి ఆనవాలుగా నిలిచిన సీతాదేవిని అనునిత్యం ఆరాధిస్తూ ఉంటారు. సీతారాముల పేరును విడదీసి రాయడానికి కూడా భక్తులు ఒప్పుకోరు. అంతగా వాళ్లు సీతారాములను అభిమానిస్తారు ... భక్తిశ్రద్ధలతో అర్చిస్తారు.
సీతారాములు తమ వనవాస కాలంలో అనేక ప్రదేశాలను తమ పాదధూళిచే పవిత్రం చేస్తూ వెళ్లారు. ఈ నేపథ్యంలో వాళ్లు కూర్చున్న ప్రదేశాలు పుణ్యక్షేత్రాలుగా ... స్నానమాచారించిన తీర్థాలు పుణ్యతీర్థాలుగా ప్రసిద్ధి చెందాయి. అలాంటి వాటిలో ఒకటిగా 'శ్రీరామకుండం' దర్శనమిస్తుంది. సాక్షాత్తు సీతారాములు స్నానమాచరించినట్టుగా చెప్పబడుతోన్న ఈ జలాశయం 'నాసిక్' క్షేత్రంలో కనిపిస్తుంది.
సీతారాములు కొంతకాలంపాటు ఈ ప్రదేశంలో విడిది చేశారనీ, ఆ సమయంలో ఇక్కడి కొలనులో స్నానాలు చేసేవారని స్థలపురాణం చెబుతోంది. ఈ జలాశయానికిగల విశిష్టతను తెలుసుకుని క్రీ.శ.16 శతాబ్దం ద్వితీయార్థంలో, ఇక్కడ స్నాన ఘట్టాలు నిర్మించినట్టు తెలుస్తోంది. ప్రతి పన్నెండు సంవత్సరాలకి ఒకసారి ఇక్కడ జరిగే 'కుంభమేళా'కి వేల సంఖ్యలో భక్తులు హాజరవుతూ ఉంటారు.
శ్రీరామకుండంలో స్నానమాచరించడం వలన ఆయురారోగ్యాలు ... అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని చెప్పబడుతోంది. ఈ నీటిని తలపై చల్లుకున్నా ... తీర్థంగా స్వీకరించినా మోక్షం లభిస్తుందని స్పష్టం చేయబడుతోంది. సంపదలను ... సంతోషాలను ... మోక్షాన్ని ప్రసాదించడమే శ్రీరామకుండం ప్రత్యేకతగా భక్తులు చెప్పుకుంటూ ఉంటారు. ఈ తీర్థంలో స్నానమాచరించిన వారికి సీతారాముల ఆశీస్సులు దక్కుతాయని అంటారు.