స్థిరమైన సౌభాగ్యం కోసం ఏం చేయాలి ?

స్థిరమైన సౌభాగ్యం కోసం ఏం చేయాలి ?
భక్తి మార్గాన్ని సుసంపన్నం చేయడంలో స్త్రీలు ప్రధానమైనపాత్రను పోషిస్తుంటారు. భజనలతో ... పారాయణాలతో ఆలయ వాతావరణానికి ఆహ్లాదాన్ని తెస్తుంటారు. ఇక అనునిత్యం ఆలయానికి వచ్చే మహిళా భక్తులంతా కలిసి, 'లలితా సహస్రనామావళి'ని పఠిస్తుంటారు.లలితా సహస్ర నామావళి కోరిన వరాలను ప్రసాదించే ఒక కల్పవృక్షం వంటిది. ఈ కారణంగానే స్త్రీలంతా తమకి స్థిరమైన సౌభాగ్యాన్ని ఇవ్వవలసినదిగా అమ్మవారిని కోరుతూ లలితను పూజిస్తుంటారు.

లలితా సహస్రనామావళికి గల శక్తి అపారమైనది. అగస్త్య మహర్షికి సాక్షాత్తు హయగ్రీవస్వామి ఈ నామావళిని ఉపదేశించినట్టు పురాణాలు చెబుతున్నాయి. ఏ మంత్రనికైనా అనంతమైన శక్తిని ఇచ్చేది బీజాక్షరాలే. అలాంటి బీజాక్షరాలు లలితా సహస్రనామంలో నిక్షిప్తం చేయడం జరిగింది. ఈ కారణంగానే లలిత చదవడం వలన ఆ బీజాక్షరాలు ఆశించిన ఫలితాలను ఇస్తాయి ... జీవితాన్ని ప్రభావితం చేస్తాయి.

లలితాదేవి సహస్రనామాలలో అయిదు బీజాక్షరాలు ఒకే చోట ఇమడ్చబడిన నామం ఒకటి కనిపిస్తుంది. ''వదన స్మర మాంగల్య గృహ తోరణ చిల్లికా'' అనేదే ఆ నామం. వదన .. స్మర .. మాంగల్య .. గృహ .. తోరణచిల్లికా అనేవి, ఓం హ్రీం శ్రీం క్లీం సౌ: అనే బీజాక్షరాలను తమలో ఇముడ్చుకున్నాయి. ఈ కారణంగా ఈ నామాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ... నియమ నిష్ఠలతో పఠించడం వలన స్త్రీల సౌభాగ్యాన్ని అమ్మవారు సదా రక్షిస్తూ ఉంటుందనీ, వారికి సుస్థిరమైన సౌభాగ్యాన్ని అనుగ్రహిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

More Bhakti Articles