ఉగాది పండుగ రోజున ఏం చేయాలి ?
చాంద్రమానం ప్రకారం చైత్రమాసపు తొలిరోజు ( పాడ్యమి) ని తెలుగు సంవత్సరాదిగా జరుపుకోవడం ఒక సంప్రదాయంగా వస్తోంది. తొలి రుతువైన 'వసంతం'లో .. తొలి పక్షమైన శుక్ల పక్షంలో ... తొలిమాసమైన 'చైత్రం'లో తొలితిథి అయిన 'పాడ్యమి' రోజున ఉత్సాహాల ఉగాది ఆరంభమవుతుంది. సృష్టి రచనలో భాగంగా బ్రహ్మదేవుడు యుగారంభానికి ఈ రోజునే శ్రీకారం చుట్టాడు కనుక, ఈ రోజుని యుగాదిగా ... ఉగాదిగా పిలుస్తుంటారు.
ప్రకృతి తనకు తానుగా మానవాళికి తొలిపూతను ... తొలికాతను సమర్పిస్తుంది. మానవులు ఆ పంటను కృతజ్ఞతాపూర్వకంగా భగవంతుడికి నివేదన చేసి, దానిని ప్రసాదంగా స్వీకరించడమే ఉగాది పండుగలోని పరమార్థం. అలాంటి ఈ పండుగ రోజున ఉదయాన్నే కుంకుడుకాయ రసంతో తలస్నానం చేయాలి. తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే నూతన వస్త్రాలను ధరించాలి. నుదుటన తిలక ధారణచేసి పెద్దల ఆశీస్సులను తీసుకోవాలి. వాకిట్లో రంగవల్లికలు దిద్ది ... గడపకు పసుపురాసి ... గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాలి.
పూజా మందిరాన్ని వివిధ పుష్పమాలికలతో భక్తి శ్రద్ధలతో అలంకరించాలి. త్రిమూర్తుల ... త్రిశక్తి మాతల చిత్రపటాలను అలంకరించి షోడశోపచార పూజ చేయాలి. ప్రకృతి ప్రసాదించిన పంట నుంచి తీపి .. చేదు .. పులుపు .. వగరు .. ఉప్పు .. కారం రుచులతో ఉగాది పచ్చడిని చేసి ఇష్ట దైవానికి నైవేద్యంగా సమర్పించాలి. సాయంత్రం ఆలయ దర్శనం చేసుకుని అక్కడ జరిగే పంచాంగ శ్రవణాన్ని వినాలి.
ఆలయ వాతావరణం కారణంగా నూతన సంవత్సరమంతా భగవంతుడి సేవలోనే గడవాలి ... ఆయన ఆశీస్సులతోనే ముందుకుసాగాలనే ఆలోచన కలుగుతుంది. అందరూ కలిసి సఖ్యతగా ఉండాలి ... ప్రకృతి ప్రసాదించినది సమానంగా పంచుకోవాలనే సందేశం ఈ పండుగలో ఉందనే విషయం అర్థమవుతుంది. ఈ రోజున 'విద్యావ్రతం' ... 'ఆరోగ్యవ్రతం' ... 'తిలక వ్రతం' జరుపుకోవడం వలన విశేష ఫలితాలను పొందవచ్చని శాస్త్రం చెబుతోంది.
ఈరోజు నుంచే 'వసంత నవరాత్రులు' ప్రారంభమవుతాయి. సీతారాముల కళ్యాణ మహోత్సవమనే మధురమైన ఘట్టానికి అవసరమైన ఏర్పాట్లు చేయబడుతుంటాయి. ఈ కారణంగా ఉగాది రోజున శ్రీరాముడిని పూజించడం వలన, శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని ఆరాధించడం వలన సకలశుభాలు చేకూరతాయి. ఈ విధమైన నియమాలను ఆచరిస్తూ ఉగాది పండుగను జరిపుకోవడం వలన, ఉగాది పచ్చడిని ప్రసాదంగా స్వీకరించడం వలన ఆధ్యాత్మిక పరమైన ఫలితాలతో పాటు ఆరోగ్యపరమైన ప్రయోజనాలు కూడా ఎన్నో లభిస్తాయి.