భయాలను తొలగించే భగవంతుడి నెలవు
సాధారణంగా ప్రతి గ్రామంలోను రామాలయం కనిపిస్తూ వుంటుంది. ఇక కొన్ని గుట్టలపైన ... గుహల్లోనూ నరసింహస్వామి దర్శనమిస్తూ వుంటాడు. అయితే ఈ దైవాలు ఒకే గర్భాలయంలో ... అందున హైదరాబాద్ నగరం నడిబొడ్డున కొలువై ఉండటం విశేషంగా అనిపించక మానదు. అరుదైన ఈ దృశ్యానికి వేదికగా నిలిచిన ఈ క్షేత్రం 'కోఠి'లో కనిపిస్తుంది.
వందల సంవత్సరాలక్రితం నిర్మించబడిన ఈ ఆలయం ఆనాటి చరిత్రను ఘనంగా ఆవిష్కరిస్తూ ఉంటుంది. చక్కని రాజగోపురం ... తీర్చిదిద్దిన ప్రాకారాలు ... అందమైన మంటపాలు కలిగిన ఈ ఆలయంలో ఒక వేదికపై సీతారామలక్ష్మణులు, ఆ వేదికకి కాస్త కింద పీఠంపై లక్ష్మీ నరసింహస్వామి దర్శనమిస్తూ ఉంటారు. ఇటు రామావతారాన్ని ... అటు నరసింహ అవతారాన్ని సతీ సమేతంగా ఆవిష్కరిస్తోన్న దైవాలను ఒకే గర్భాలయంలో వీక్షించడం అరుదైన విశేషంగా భక్తులు చెప్పుకుంటూ ఉంటారు.
ధర్మ మార్గాన్ని అనుసరించమని శ్రీరాముడు చెబితే, ఆ మార్గానికి అడ్డుపడిన వాళ్లు శిక్షించబడతారని నరసింహస్వామి తెలియజేశాడు. అలాంటి దైవాలు కొలువైన ఈ ఆలయం, నగర జీవితంలో వత్తిళ్లకు గురైనవారికి ప్రశాంతతను ప్రసాదిస్తుంది. ఇదే ప్రాంగణంలో కొలువుదీరిన శివుడు ప్రత్యేక మందిరంలో పూజలు అందుకుంటూ ఉంటాడు. ఇక శివకేశవుల నెలవైన ఈ క్షేత్రానికి హనుమంతుడు క్షేత్రపాలకుడిగా వ్యవహరిస్తూ ఉంటాడు.
ఈ ఆలయ ప్రాంగణంలో అడుగుపెట్టిన వాళ్లు భయాందోళనల నుంచి బయటపడతారని భక్తులు చెబుతుంటారు. దుష్ట ప్రయోగాల బారినపడిన వాళ్లకీ, గ్రహసంబంధమైన దోషాలతో బాధలుపడుతున్న వాళ్లకి విముక్తి కలుగుతుందని అంటారు. ఎంతో విశిష్టతను కలిగివున్న ఈ ఆలయాన్ని స్థానికులు కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటారు. అనునిత్యం ఆ స్వామికి నిత్య నీరాజనాలు సమర్పిస్తూ ఉంటారు.