సీతారాములు ఇప్పటికీ ఇక్కడికి వస్తుంటారట !
రామాయణం చదివినవారి మనసులోనూ ... విన్నవారి మనసులోనూ 'అయోధ్య' పట్ల ఒక విధమైన అనురాగం ఏర్పడుతుంది. అయోధ్య నగరాన్ని కనులారా చూడాలనీ, సీతారాములు తిరుగాడిన ఆ పవిత్ర ప్రదేశాలను ఆప్యాయంగా స్పర్శించాలనిపిస్తుంది. ఇక అయోధ్యలో అడుగుపెడితే అక్కడి నుంచి ఒక పట్టాన రాబుద్ధికాదు. సీతారాముల కాలంలో పుట్టివుంటే బాగుండునని అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్లు లేనందుకు బాధనిపిస్తుంది.
అయితే సీతారాములు ఇక్కడ లేరనే మాట వింటే అయోధ్య వాసులు అసహనానికి లోనవుతారు. అవతారమూర్తులైన సీతారాములు ఇప్పటికీ ఇక్కడికి వస్తుంటారని చెబుతుంటారు. ఆ విశ్వాసంతోనే సీతారాముల శయన మందిరాన్ని అలంకరిస్తూ ఉంటారు. అయోధ్యలో చూడదగిన ప్రదేశాల్లో 'కనకభవనం' ఒకటిగా కనిపిస్తుంది. సువిశాలమైన వాకిలిని కలిగిన ఈ భవనం చూపరుల కళ్లను కట్టిపడేస్తుంది.
ప్రతినిత్యం ఎంతోమంది యాత్రికులు ఈ భవనం చూడటానికి ఇక్కడికి వస్తుంటారు. సీతమ్మతల్లి తిరిగిన నేలపై అడుగుపెడుతూనే, ఆమె పలకరించినంతగా ఆనందానుభూతులు పొందుతుంటారు. సీతపట్ల గల అభిమానంతో ఆమెకి కైకేయి కానుకగా ఈ భవనాన్ని ఇచ్చిందని స్థలపురాణం చెబుతోంది. ఇక్కడ ఏర్పాటు చేయబడిన సీతారాముల చిత్రపటాలు ... అందులో వాళ్లు ధరించిన ఆభరణాలు యాత్రికులను మంత్రముగ్థులను చేస్తుంటాయి.
ఈ కనకభవనంలో సీతారాముల శయన మందిరం కనిపిస్తుంది. ఇక్కడే సీతారాములు శయనిస్తారని స్థానికులు బలంగా నమ్ముతుంటారు. ఈ కారణంగానే ఇప్పటికీ ప్రతిరోజు ఈ శయన మందిరాన్ని వివిధ పుష్ప మాలికలతో అలంకరిస్తూ ఉంటారు. సీతారాములు ఇక్కడికి వచ్చి వెళుతుంటారనడానికి అనేక నిదర్శనాలు ఉన్నాయని అనుభవపూర్వకంగా ... అనుభూతిపూర్వకంగా చెబుతుంటారు.