కోరినవరాల నిచ్చే కొండంత గణపతి
వ్యక్తిగతంగా జరుపుకునే శుభకార్యాలను ... సమాజ శ్రేయస్సును ఆశించి చేసే దైవకార్యాలను ఆరంభించడానికి ముందు గణపతిని పూజించడం ఆనవాయతీగా వస్తోంది. మంచికోసం తలపెట్టే కార్యాలకు ఆటంకాలు ఏర్పడకుండా గణపతి చూసుకుంటూ ఉంటాడు. ఈ కారణంగానే మానవులు ... మహర్షులు ... దేవతలు ముందుగా ఆయనను ఆరాధిస్తూ తమ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుంటారు.
ఈ నేపథ్యంలో గణపతి అనేక నామాలను ... ముద్రలను కలిగి కనిపిస్తూ ఉంటాడు. వీటిలో విశిష్టమైనదిగా 'చింతామణి గణపతి' రూపాన్ని గురించి చెబుతుంటారు. చింతలు తీర్చే వినాయకుడిగా చింతామణి గణపతిగా స్వామి పూజలు అందుకునే క్షేత్రం మనకి విశాఖ జిల్లా 'సిరసపల్లి' లో దర్శనమిస్తుంది. మైసూరు దత్తాపీఠం వారి అధ్వర్యంలో నిర్వహించబడుతోన్న ఈ క్షేత్రంలో స్వామి పగడపు రంగులో తలపాగాను ధరించి దర్శనమిస్తూ ఉంటాడు.
సువిశాలమైన ప్రదేశంలో ... ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్మించబడిన ఈ ఆలయం, పవిత్రతకు - ప్రశాంతతకు ప్రతీకగా నిలుస్తుంది. భక్తులు నేరుగా గర్భాలయంలోకి వెళ్లి స్వామిని దర్శించుకుని నైవేద్యాలు సమర్పించే అవకాశం ఉండటం ఇక్కడి ప్రత్యేకతగా చెబుతుంటారు. ఓ రకంగా ఇది భక్తులకు మరింత సంతోషాన్ని ... సంతృప్తిని కలిగించే విషయమని అంటారు. ఎంతోమంది దేవతలు ... మహర్షులు ... మహారాజులు చింతామణి గణపతిని పూజించి అనేక కష్టాల నుంచి బయటపడినట్టుగా పురాణాలు చెబుతున్నాయి.
ఈ కారణంగానే సమస్యలతో సతమతమైపోయే వాళ్లు స్వామి కటాక్షాన్ని ఆశిస్తూ ఇక్కడి ఆలయానికి వస్తూ ఉంటారు. విద్య .. వివాహం .. ఉద్యోగం .. వ్యాపారం .. సంతానం .. సౌభాగ్యానికి సంబంధించిన సమస్యలకు పరిష్కార మార్గంగా ఇక్కడి స్వామి కనిపిస్తుంటాడు. చింతామణి గణపతి అనుగ్రహంతో చిక్కులనుంచి బయటపడినవాళ్లు, స్వామివారికి మొక్కుబడులు చెల్లిస్తూ ఇక్కడ కనిపిస్తారు. స్వామివారి మహిమాన్వితుడని చెప్పడానికి ఒక్కొక్కరూ ఒక్కో నిదర్శనంగా అనిపిస్తారు.