విప్పతదియ నోము
మనసులోని కోరికలు నెరవేరడానికీ ... అనుకున్నవి సాధించుకోవడానికి మార్గంగా 'విప్ప తదియ నోము' చెప్పబడింది. ఈ నోమును నోచుకునే వారు 'విప్పచెట్టు'ను అమ్మవారిగా భావించి, ప్రతి నెలా శుద్ధ తదియ రోజున పూజ చేస్తూ, ఏడాది తరువాత ఉద్యాపన చెప్పుకోవలసి వుంటుంది. ఈ నోమును ప్రారంభించిన వారు ఉదయాన్నే తల స్నానం చేసి విప్పచెట్టు దగ్గరికి చేరుకోవాలి. విప్ప చెట్టుకు నమస్కరిస్తూ తాను చేపడుతోన్న నోమును స్వీకరించి, తన ఆశలు ఫలించేలా చేయమంటూ ప్రార్ధించాలి.
తన చేతికి ఒక తోరం కట్టుకుని ... చెట్టుకు ఒక తోరం కట్టాలి. 'మంగళ' పేరుతో అమ్మవారిని చెట్టు యందు ఆవాహన చేసి, పంచభక్ష్య పరమాన్నాలు నైవేద్యంగా సమర్పించాలి. ఈ విధంగా అమ్మవారిని వైశాఖంలో ... 'వైష్ణవీ'గా ఆవాహన చేసి బెల్లం నైవేద్యం పెట్టాలి. జ్యేష్టంలో 'మాయ'గా ఆవాహన చేసి తేనె, ఆషాడంలో 'కాళరాత్రి' పేరుతో ఆవాహన చేసి వెన్న నైవేద్యం పెట్టాలి. శ్రావణంలో 'దురత్యయ'గా ఆవాహన చేసి పెరుగును, భాద్రపదంలో 'మహామాయ'గా ఆవాహన చేసి పంచదారని నివేదన చేయాలి.
ఇక ఆశ్వియుజంలో 'మతంగి'గా ఆవాహన చేసి పాయసాన్ని, కార్తీకంలో 'కాళీ'గా ఆవాహన చేసి పాలను నైవేద్యంగా సమర్పించాలి. మార్గ శిరంలో 'కమలవాసిని'గా ఆవాహన చేసి పటిక బెల్లాన్ని, పుష్యంలో 'శివా'గా ఆవాహన చేసి బెల్లం పాయసాన్ని నైవేద్యం పెట్టాలి. మాఘంలో 'సహస్ర చరణ'గా ఆవాహన చేసి ఆవునేతిని, ఫాల్గుణంలో 'సర్వమంగళ స్వరూపిణి'గా ఆవాహన చేసి కొబ్బరికాయను సమర్పించాలి.
ఈ విధంగా 12 మాసాల పాటు నెలకోసారి 'విప్ప చెట్టు'ను పూజిస్తూ, తనకూ ... చెట్టుకూ ఒక్కో తోరణం కడుతూనే ఉండాలి. ఏడాది పూర్తయిన తరువాత అంటే మళ్లీ వచ్చే చైత్ర శుద్ధ తదియ రోజున 12 రకాల నైవేద్యాలను సమర్పించాలి. 12 మంది ముత్తయిదువులను పిలిచి ఒక్కో ముత్తయిదువుతో తన చేతికి ... చెట్టుకి ఉన్న ఒక్కో తోరణాన్ని (జత ) విప్పించుకోవాలి.
అలా తన చేతికి ... చెట్టుకు గల తోరాలను విప్పిన ఒక్కో ముత్తయిదువుకు పసుపు కుంకుమలను ... గాజులను ... 12 రకాల ప్రసాదాలను దక్షిణ తాంబూలాలతో సహా వాయనంగా ఇవ్వాలి. ఆ తరువాత ఆ తోరాలను పసుపు కుంకుమలు రాసిన ఒక చేటలో వుంచి, ప్రవహిస్తోన్న నీటిలో వదిలివేయడంతో ఉద్యాపన కార్యక్రమం పూర్తి అవుతుంది.