సీతకు రాముడు చూపించిన పుణ్యతీర్థం
సీతారామలక్ష్మణులు వనవాస కాలంలో అనేక ప్రదేశాలను సందర్శిస్తూ ముందుకుసాగారు. ఆ నేపథ్యంలో వాళ్లు అడుగుపెట్టిన క్షేత్రంగా కరీంనగర్ జిల్లాలోని 'రామగుండం' కనిపిస్తుంది. శ్రీ రాముడి కారణంగా ఈ ప్రదేశంలో 108 గుండాలు (నీటి గుంటలు) ఆవిర్భవించిన కారణంగానే ఈ ప్రాంతానికి 'రామగుండం' అనే పేరు వచ్చింది. ఇక్కడ కొన్ని గుట్టలన్నీ కలిసి ఒకే గుట్టగా ఏర్పడినట్టు కనిపిస్తూ ఉంటుంది.
ఎత్తుగా ... సువిశాలమైన ప్రదేశంలో ఈ గుట్ట పరచుకుని ఉంటుంది. పరమశివుడి జటలో నుంచి దూకుతున్నట్టుగా జలపాతం కనువిందుచేస్తూ ఉంటుంది. ఈ జలపాతం నేరుగా కిందికి రాకుండా, కొన్ని గుండాలలో ప్రవేశించి అక్కడి నుంచి తిరిగి మరో గుండంలోకి దూకుతూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ జలపాతం సిగ్గుల మొగ్గవుతూ అనేక వయ్యారాలు పోతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది.
ఇక్కడ ఈ గుండాలు ఏర్పడటానికి కారణంగా ఓ ఆసక్తికరమైన కథ వినిపిస్తూ ఉంటుంది. ఒకసారి సీత .. తనకి 108 దివ్య తీర్థాలలో స్నానమాచరించాలని ఉందని శ్రీరాముడితో చెప్పిందట. రాముడు ఆమెను ఈ ప్రదేశానికి తీసుకువచ్చి, సీత కోరికను నెరవేర్చే శక్తిని తనకి ప్రసాదించమని పరమశివుడిని ప్రార్ధించాడు. ఆదిదేవుడి అనుగ్రహంతో ఈగుట్టపై నుంచి జలపాతం దూకుతుంది. 108 దివ్య తీర్థాలను కలుపుకుని వేగంగా వస్తోన్న ఆ జలపాతం దూకుడిని అదుపు చేయడానికి గాను శ్రీ రాముడు 108 గుండాలను సృష్టించాడు.
ఒక్కో గుండంలోకి ప్రవేశించిన నీరు ఒక్కో పుణ్య తీర్థం విశేషాన్ని సంతరించుకుంటుందని అంటారు. ఈ 108 గుడాలలో ఒక్కోదానికి ఒక్కోపేరు ఇక్కడ వినిపిస్తుంది. ఇక్కడ సీతారాములు తిరుగాడినట్టు వారి పాదముద్రలు కనిపిస్తుంటాయి. తరువాత కాలంలో నిర్మించబడిన సీతారాముల మందిరం దర్శనమిస్తుంది. ఇంకా వేంకటేశ్వరస్వామి .. సంతోషిమాత .. గాయత్రీమాత మందిరాలు కూడా ఇక్కడ కొలువుదీరి ఉంటాయి. ఆహ్లాదకరమైన వాతావరణంలో అలరారుతోన్న ఈ క్షేత్రంలోకి అడుగుపెట్టగానే, మనసుకి ఉల్లాసం కలుగుతుంది ... ఆధ్యాత్మిక పరమైన ఉత్సాహం కలుగుతుంది.