రుణ బాధలను నివారించే శైవ క్షేత్రం

రుణ బాధలను నివారించే శైవ క్షేత్రం
''ఏ జన్మలో చేసిన రుణమో ఈ జన్మలో ఇలా తీరింది'' అనే మాట చాలా చోట్ల వినడం జరుగుతుంటుంది. క్రితం జన్మలో చేసిన రుణమే ఈ జన్మలో కొన్ని బంధాలుగా చేరువై వాటిని తీర్చుకోవడం జరుగుతుందని శాస్త్రం చెబుతోంది. అందుకే ఈ విషయం తెలిసినవాళ్లు చాలామంది రుణం ఉండకుండా జాగ్రత్తపడుతూ ఉంటారు.

ఇక జన్మజన్మలపాటు వెంటాడే ఈ రుణానుబంధం నుంచి బయటపడాలనుకునేవారికి శ్రీనాగనాథస్వామి ఆలయం ఒక ఆశాకిరణంలా కనిపిస్తుంది. మహారాష్ట్రలోగల ఈ క్షేత్రంలో శివపార్వతులు కొలువై భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు. పురాణపరమైన విశిష్టతను సంతరించుకున్న ఈ క్షేత్రంలో ప్రత్యేకత కలిగిన కోనేరు కనిపిస్తూ ఉంటుంది. ఈ కోనేరులో స్నానం చేసిన వారు రుణ విముక్తిని పొందుతారని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు.

ఈ కారణంగానే ఈ కోనేరును 'రుణ విమోచక తీర్థం' అని పిలుస్తూ ఉంటారు. ఇక భక్తులను రుణ విముక్తులను చేయడమే కాదు, వారికి గల శనిదోషాలు ... నాగదోషాలు ఈ క్షేత్రదర్శనం వలన నివారించబడతాయని స్థలపురాణం చెబుతోంది. పరివార దేవతలతో కలిసి భక్తుల పాపాలను పారద్రోలే ఇక్కడి స్వామివారి క్షేత్రం పర్వదినాల్లో మరింత సందడిగా కనిపిస్తుంది ... అనేక వరాలను ప్రసాదించే అక్షయ పాత్రలా అనిపిస్తుంది.

More Bhakti Articles