మాసశివరాత్రి రోజున ఏం చేయాలి ?
పిలిస్తే పలికే దేవుడు ... ఆర్తితో కొలిచిందే తడవుగా అనుగ్రహించే దేవుడు ... పరమేశ్వరుడు. తనని ఆరాధించే భక్తులలో ధనిక - పేద అనే బేధాలు ఉండకూడదనే ఉద్దేశంతోనే దోసెడు నీళ్లతో చేసే అభిషేకంతోను ... మారేడు దళాలతోను ఆయన సంతృప్తి చెందుతూ ఉంటాడు. ఈ కాస్త సేవకే ఈశ్వరుడు కరుణిస్తాడా అనే సందేహం కొంతమందికి కలుగుతుంటుంది. కొద్దిపాటి ఈ సేవకే మల్లికార్జునుడు కరిగిపోయి కొండంత వరాలను కురిపిస్తాడని పురాణాలు చెబుతున్నాయి.
విశ్వనాథుడి నుంచి వీలైనన్ని వరాలను పొందిన వారెందరో పురాణాలలో కనిపిస్తూ ఉంటారు. మహాదేవుడిని అనుక్షణం స్మరిస్తూ ఉండవచ్చు ... అనునిత్యం ఆరాధిస్తూ ఉండవచ్చు. అయితే 'మాసశివరాత్రి' రోజున ఆయనని సేవించడం వలన అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని శాస్త్రం చెబుతోంది. మాసశివరాత్రి మహాశివుడికి అత్యంత ప్రీతికరమైన రోజని చెప్పబడుతోంది.
ఈ రోజున ఆయన మరింత ఉత్సాహంగా ... కరుణా సముద్రుడిగా కనిపిస్తూ ఉంటాడట. అందువలన ఈనాటి సాయంత్రం వేళ పరమశివుడిని ప్రేమతో అభిషేకించి, మనసుతో పాటుగా మారేడు దళాలను సమర్పించాలి. ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టి పగలంతా శివుడి లీలా విశేషాలకు సంబంధించిన గ్రంధాలను పారాయణం చేస్తూ గడపాలి. ఇక సాయంత్రం పూజాభిషేకాలు ముగిశాక శివనామ స్మరణతో జాగరణ చేయాలి.
అవకాశం ఉన్నవాళ్లు దగ్గరలో గల శివాలయానికి వెళ్లి స్వామివారి సన్నిధిలో దీపారాధన చేయడం మరింత మంచిది. వీలైతే భక్తులంతా కలిసి ఒక బృందంగా ఏర్పడి శివాలయంలోనే జాగరణ చేయవచ్చు. ఈ విధంగా మాసశివరాత్రి రోజున దృష్టినీ .. మనసును స్వామివారి పాదాల చెంత ఉంచి సేవిస్తే మనోభీష్టాలు నెరవేరుతాయని చెప్పబడుతోంది.