భక్తి మార్గంలో ప్రయాణానికి ఆటంకాలేంటి ?
జీవితాన్ని ఇచ్చిన భగవంతుడు కుటుంబం ... సిరిసంపదలు ... బంధాలు ... అనుబంధాలు ... వ్యామోహాలు అనే అనేక వలయాలను సృష్టిస్తాడు. అవన్నీ అశాశ్వతాలని తెలుసుకున్న వాళ్లు మాత్రమే తామరాకుపై నీటిబొట్టులా వ్యవహరిస్తుంటారు. వ్యామోహాలకు దూరమై భగవంతుడికి సమీపంలో బతకాలని అనుకుంటారు. భక్తి ... ముక్తిని అందిస్తుందనీ, ఆశ .. భయాన్ని కలిగిస్తుందని విశ్వసిస్తూ ఉంటారు.
అలాంటివారిని మాత్రమే ఆ భగవంతుడు ఆప్యాయంగా చేరదీస్తుంటాడు. ఇందుకు ఉదాహరణగా పురందరదాసు జీవితంలోని ఒక ఘట్టం కనిపిస్తుంది. భగవంతుడే సర్వానికి యజమాని ... ఆయన సేవకు మించిన భాగ్యంలేదని భావించిన పురందరదాసు తన ఆస్తిపాస్తులను పేదలకి పంచిపెడతాడు. వ్యాసరాయల వారిని కలవాలనే ఉద్దేశంతో భార్యాబిడ్డలతో కలిసి 'హంపి' నగరానికి బయలుదేరుతాడు.
అడవీ మార్గంలో ప్రయాణిస్తూ ఉండగా భార్య భయపడుతూ ఉండటాన్ని గమనించిన పురందరదాసు, సర్వాన్ని వదులుకున్న తాము మరి దేనికీ భయపడవలసిన పనిలేదని అంటాడు. మంచినీళ్లు తెచ్చిన బంగారు చెంబుని అప్పుడామె ఆయనకి చూపిస్తుంది. ఆ చెంబును దొంగలు దోచుకుపోతారేమోనని భయంగా ఉందని చెబుతుంది. బంగారం పట్ల ఆమెకి గల స్త్రీ సహజమైన వ్యామోహం చూసి పురందరదాసు నవ్వుకుంటాడు.
ధన .. కనక ... వస్తు .. వాహనాలపై గల వ్యామోహమే భగవంతుడిని చేరుకోవడానికి అడ్డుపడుతుంటుందని చెబుతాడు. ఆ వ్యామోహం నుంచి దూరంగా జరిగినప్పుడే భగవంతుడిపై దృష్టి నిలుస్తుందని అంటాడు. ఆమె దగ్గర గల బంగారు చెంబును తీసుకుని దూరంగా విసిరేస్తాడు. ఎప్పుడైతే ఆ బంగారు చెంబు తన నుంచి దూరమైందో అప్పటి నుంచి పురందరదాసుతో పాటు ఆమె భక్తిభావంతో గొంతు కలపగలిగింది. ఆయనతో కలిసి హాయిగా కీర్తనలు పాడుకుంటూ నిశ్చింతగా హంపి చేరుకోగలిగింది.