గుమ్మడిగౌరీ నోము
ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. జాతకాలు చూస్తూ ... వచ్చిన డబ్బుతో ఆయన తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఆయనకున్న సంతానం ఒక మగపిల్లవాడు మాత్రమే. తన కొడుకు అల్పాయుష్కుడనీ, యుక్త వయసులోనే మరణిస్తాడని తెలుసుకున్న ఆ బ్రాహ్మణుడు బాధతో తల్లడిల్లిపోసాగాడు. తన కొడుకు ఆ గండం నుంచి గట్టెక్కాలంటే, భక్తి శ్రద్ధలతో పాటు నిండు నూరేళ్లు సుమంగళిగా వుండే యువతితో వివాహం జరిపించాలని నిశ్చయించుకున్నాడు.
ఆ అబ్బాయికి యుక్త వయసు రాగానే ముందుగానే అన్వేషించి పెట్టిన అమ్మాయితో పెళ్లి జరిపించాడు. తన కొడుక్కి ఏ సమయంలో ప్రాణ గండం ఉందనే విషయం చెప్పి, అతణ్ణి కాపాడుకునే బాధ్యత ఆమెదేనని స్పష్టం చేశాడు. దాంతో తాను చిన్నప్పటి నుంచి పూజిస్తోన్న అమ్మవారిని కలిసి ఆ విషయాన్ని మొరపెట్టుకోవాలని అతని కోడలు నిర్ణయించుకుంది. భర్తను ... పూజా సామాగ్రిని తీసుకుని అడవిలో చెట్టుకింద ప్రతిష్ఠింపబడి వున్న అమ్మవారి విగ్రహం దగ్గరికి వెళ్లింది.
తన భక్తురాలకి వచ్చిన కష్టాన్ని ముందుగానే తెలుసుకున్న పార్వతీదేవి, వృద్ధురాలి వేషంలో ఆ చెట్టుకు సమీపంలో కూర్చుని వుంది. ఆ యువతికి వచ్చిన కష్టం గురించి అడిగి తెలుసుకుని, 'గుమ్మడి గౌరీ' నోము నోచుకుంటే భర్తను కాపాడుకోవచ్చనంటూ విధివిధానాలు చెప్పింది. దాంతో ఆ యువతి అక్కడి పరిసరాలను గాలించి వెంటనే మూడు గుమ్మడి కాయలు తీసుకు వచ్చింది. తాను ఇంటి నుంచి తెచ్చిన పసుపు కుంకుమలను ... రవికల గుడ్డను సంచీలో నుంచి బయటకి తీసింది. తన దృష్టిలో ఆమే గౌరీదేవి అంటూ మనసులో అమ్మవారిని స్మరిస్తూ వాటిని ఆ వృద్ధురాలికి వాయనమిచ్చింది. తన అయిదోతనాన్ని కాపాడమంటూ కన్నీళ్లతో ప్రార్ధించింది.
మారువేషంలో ఉన్న అమ్మవారి మనసు కరిగిపోయింది. 'దీర్ఘ సుమంగళీ భవ' అంటూ ఆ యువతిని దీవించి అదృశ్యమైపోయింది. అమ్మవారి దీవెన వృధా కాదు కాబట్టి ఆ యువతి భర్తకి ప్రాణగండం గడిచింది. అది మొదలు ఈ నోము ప్రచారంలోకి వచ్చినట్టుగా చెప్పబడుతోంది. ఈ కథ చెప్పుకుని అక్షింతలు తలపై వేసుకుని, ఒక ముత్తయిదువుకు దక్షిణ తాంబూలాలతో ఒక పండును వాయనమివ్వాలి.