విజయాలను ప్రసాదించే విజయ ఏకాదశి
జీవితంలో సిరిసంపదలు కావాలన్నా ... కీర్తి ప్రతిష్ఠలు కావాలన్నా ఎంచుకున్న మార్గంలో విజయాలను సాధించవలసి ఉంటుంది. అనంతమైన ఆనందాన్ని కలిగించే విజయాన్ని సొంతం చేసుకోవాలనే ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే ప్రతి విజయానికీ కూడా మానవ ప్రయత్నంతో పాటు దేవుడి అనుగ్రహం కూడా కావాలి. అప్పుడే ఆశించిన విజయం దక్కుతుంది ... సరిహద్దులు లేని సంతోషం చేరువవుతుంది.
అయితే విజయానికి ఇటు మానవ ప్రయత్నం ... అటు దైవానుగ్రహంతో పాటుగా, ఆ కార్యక్రమాన్ని ప్రారంభించే మంచిరోజు కూడా కలిసిరావాలి. అలాంటి మంచిరోజే 'ఫాల్గుణ బహుళ ఏకాదశి'గా చెప్పబడుతోంది. దీనినే 'విజయ ఏకాదశి'గా పిలుస్తుంటారు. ఈ రోజున తలపెట్టిన కార్యక్రమాలు ఏవైనా ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా కొనసాగుతాయని చెప్పబడుతోంది.
రావణాసురుడి లంకలో సీతాదేవి బందీగా ఉందని తెలుసుకున్న శ్రీరామచంద్రుడు ఆలోచనలో పడతాడు. సముద్రాన్ని దాటితేనేగాని లంకకు చేరుకోవడం సాధ్యంకాదు. సముద్రాన్ని దాటడం అంత ఆషామాషీ విషయమూ కాదు. అంతటి కష్టతరమైన కార్యక్రమాన్ని ప్రారంభించాలంటే మంచిరోజు కావాలని ఆయన నిరీక్షించాడు.
విజయలను ప్రసాదించే విజయ ఏకాదశి అందుకు అనుకూలమని భావించిన ఆయన, ఈ రోజునే సేతువు నిర్మాణానికి శ్రీకారం చుట్టాడని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఉపవాస జాగరణాలతో ఈ రోజున శ్రీమహావిష్ణువును పూజిస్తూ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలని శాస్త్రం చెబుతోంది. ఈరోజున శక్తి మేరకు దానధర్మాలు చేయడం వలన విశేషమైనటు వంటి పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయని స్పష్టం చేస్తోంది.