నెమలి ముక్కుతో తీయబడిన కోనేరు !
వివిధ పుణ్యక్షేత్రాలను దర్శించినప్పుడు అక్కడ గల పుష్కరిణిల గురించి తెలుస్తుంటాయి. ఈ కోనేర్లలో కొన్ని భగవంతుడి సంకల్పం కారణంగా ఏర్పడినవి కాగా, మరికొన్ని భక్తుల ప్రయత్నం కారణంగా ఏర్పడుతుంటాయి. ఈ రెండింటికి భిన్నంగా ఓ మహర్షి వలన ఏర్పడిన కోనేరు మనకి 'నెమలి గుండ్ల' క్షేత్రంలో కనిపిస్తుంది. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం పరిధిలో గల ఈ క్షేత్రానికి ఈ పేరు రావడానికి వెనుక ఆసక్తికరమైన నేపథ్యం ఉంది.
పూర్వం ఈ ప్రదేశంలో రంగనాథస్వామిని గురించి మయూర మహర్షి తపస్సు చేశాడు. నెమలి ముఖం గల ఈ మహర్షిని రంగనాథస్వామి అనుగ్రహిస్తాడు. ఆ మహర్షి కోరిక మేరకు ఈ ప్రదేశంలో ఆవిర్భవిస్తాడు. ఇక్కడి స్వామివారి పూజకు అవసరమైన నీటి కోసం, నెమలి ముఖం గల మహర్షి తన ముక్కుతో నేలను తవ్వి జలాశయాన్ని ఏర్పాటు చేశాడు. కోనేరును ఈ ప్రాంతంలో 'గుండం' అంటూ ఉంటారు. ఆ రకంగా ఈ ప్రదేశానికి 'నెమలి గుండ్ల' అనే పేరు వచ్చింది.
అటవీ ప్రాంతంలోగల ఈ స్వామిని పూర్వం చెంచులు ఎక్కువగా ఆరాధించే వారట. చెంచుల గూడానికి చెందిన ఓ యువతి రంగనాథుడిని ఆరాధించి ఆయనని వివాహమాడటమే అందుకు కారణమని చెబుతుంటారు. ఇక ఇక్కడి స్వామి మహిమాన్వితుడని చెబుతుంటారు. స్వామివారి సేన ఈ క్షేత్రంలో తేనెటీగల రూపంలో సంచరిస్తూ ఉంటారట. మైలతో ఎవరైనా ఈ క్షేత్రంలో అడుగుపెడితే, వారిపై తేనెటీగలు దాడిచేస్తాయని అంటారు. అలా జరిగిన సందర్భాలు కూడా లేకపోలేదు.
అందుకే భక్తులు శుచిగా పద్ధతిని పాటిస్తూ స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇక్కడి స్వామి దర్శనం వలన సంపదలు ... సంతాన సౌభాగ్యాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. ప్రకృతి సౌందర్యానికి ప్రతీకగా నిలిచే ఈ క్షేత్ర దర్శనం ఒక అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.