సీతాదేవి పుట్టిన రోజున ఏం చేయాలి ?
శ్రీరామచంద్రుడు సాక్షాత్తు శ్రీమహావిష్ణువు అయితే, సీతాదేవి సాక్షాత్తు లక్ష్మీదేవిగా చెప్పబడుతోంది. భూలోక వాసులను ధర్మ మార్గంలో నడిపించడానికి రాముడు అవతరిస్తే, పతివ్రతా ధర్మాన్ని లోకానికి చాటడానికి సీతాదేవి ఆవిర్భవించింది. రామాయణం మొత్తం మీద కూడా సీతాదేవి ఎక్కడా తొందరపడి వ్యవహరించినట్టుగా కనిపించదు.
శ్రీరాముడు అగ్నిపరీక్ష పెట్టినప్పుడు ... అడవులకి పంపినప్పుడు కూడా సీత రాముడిని అపార్థం చేసుకోలేదు. లోకానికి ధర్మాన్ని ... ఆదర్శాన్ని చాటిచెప్పడానికే ఆయన అలాంటి నిర్ణయాన్ని తీసుకున్నాడనే విషయాన్ని ఆమె గ్రహించింది. వాల్మీకి ఆశ్రమంలో ఉన్నప్పుడు కూడా ఆమె లవకుశులకు శ్రీరాముడి గొప్పతనం గురించి పదే పదే చెప్పింది. రాముడి గురించి ఎన్నడూ పల్లెత్తు మాట అనని పరమ సాధ్వీమణి సీత.
అంతటి పవిత్రురాలైన సీత ... ఫాల్గుణ బహుళ అష్టమి రోజున 'నాగేటిచాలు' లో లభించింది. జనక మహారాజు భూమిని దున్నుతూ ఉండగా, నాగలికర్రు ముందుకు కదలలేదు. పరిశీలించి చూడగా అది భూమిలో దేనినో తట్టుకుని ఆగిందని గ్రహిస్తాడు. అక్కడ తవ్వించి చూడగా ఒక పెట్టె బయటపడుతుంది. దానిని తెరిచి చూడగా లోపల దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతూ ఒక ఆడశిశువు కనిపిస్తుంది. జనకమహారాజు దంపతులు సంతోషంతో పొంగిపోతారు.
నాగేటి చాలును సంస్కృతంలో సీత అని అంటారు. అందువలన అక్కడ దొరికిన ఆ శిశువుకి 'సీత' అని నామకరణం చేస్తారు. అలా సీతాదేవి ఆవిర్భవించిన ఈ రోజున ఉదయాన్నే తల స్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించాలి. పూజా మందిరాలలో సీతారాములకు పూజాభిషేకాలు నిర్వహించాలి. ఆలయాలలో గల సీతమ్మ వారికి నూతన వస్త్రాలను సమర్పించాలి. ఈ రోజున రామాయణాన్ని పఠించడంతో పాటు, దానధర్మాలు చేయాలి. ఈ విధంగా చేయడం వలన సీతారాముల ఆశీస్సులు లభిస్తాయనీ ... సకల శుభాలు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.