నిజమైన శివభక్తికి నిదర్శనం !
తిరుజ్ఞాన సంబంధర్ బాల్యం నుంచి కూడా శివ నామస్మరణ చేస్తూ ఉండేవాడు. శివుడిని అనేక విధాలుగా స్తుతిస్తూ ... కీర్తిస్తూ ఆయన క్షేత్రాలను దర్శిస్తూ ఉండేవాడు. ఆయన శివభక్తిని గురించి తెలుసుకున్న ఎంతోమంది ప్రజలు ఆయన దర్శనార్థం వస్తుండేవారు. తమ కష్ట నష్టాలను ఆయనకి చెప్పుకుని ఉపశమనాన్ని పొందుతూ ఉండేవారు.
అలాంటి పరిస్థితుల్లో ఆయన 'వేదారణ్యం' అనే క్షేత్రానికి చేరుకుంటాడు. అక్కడ శివాలయం మూతబడి ఉండటం ఆయనకి బాధ కలిగిస్తుంది. జ్ఞాన స్వరూపమైన పరమేశ్వరుడికి అజ్ఞానంతో నిత్యాభిషేకాలు ... నైవేద్యాలు నిలిపివేయడం ఆయనకి ఆవేదనను కలిగిస్తుంది. శివ భక్తులకు సైతం ఆయన దర్శన భాగ్యం కలగకుండా చేయడానికి గల కారణం తెలుసుకున్న ఆయన ఆలోచనలో పడతాడు.
మతమనేది మనోభావాలతో ముడిపడి ఉంటుంది కనుక, ఆ ఆలయం తలుపులను బలవంతగా తెరవడం కాకుండా, భక్తితోనే తెరవాలని నిర్ణయించుకుంటాడు. ఓ రకంగా ఇది తన భక్తికి పరీక్షే అయినప్పటికీ ఈ ఆలోచనను ఆచరణలో పెట్టక తప్పదని అనుకుంటాడు. అలా చేయడం వల్లనే అక్కడి స్థానికులకు శివుడి యొక్క మహిమ గురించి తెలుస్తుందని భావించి రంగంలోకి దిగుతాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో ఆలయం దగ్గరికి చేరుకుంటారు.
తలుపులు మూయబడిన ఆలయం ముంగిట నుంచుని శివుడిని కీర్తించడం మొదలుపెడతాడు సంబంధర్. అందరూ చూస్తుండగానే కోట వంటి ఆ ఆలయానికి గల సింహద్వారం తలుపుల నుంచి గర్భాలయం తలుపుల వరకూ వాటంతట అవి తెరచుకుంటాయి. ఈ దృశ్యం చూసిన అక్కడి ప్రజలు ఆశ్చర్యచకితులవుతారు. శివ భక్తులకు గల శక్తి సామర్థ్యాలను అర్థం చేసుకుని సాష్టాంగ నమస్కారాలు చేస్తారు. ఆ రోజు నుంచి శివాలయంలో తిరిగి పూజాభిషేకాలు ప్రారంభమవుతాయి.