గ్రహపీడలు తొలగించే కాశీ కాలభైరవుడు
విశ్వనాథుడి విన్యాసాలకు వేదికగా నిలిచిన కాశీ నగరం మహా పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. అడుగుపెట్టడంతోనే అనంతమైన పుణ్య ఫలాలను అందించే క్షేత్రంగా కాశీ కనిపిస్తుంది. విశ్వనాథుడిని దర్శించడం వలన మోక్షం లభిస్తుందనీ, ఈ ప్రదేశంలో శరీరాన్ని వదిలిపెట్టిన వాళ్లు నేరుగా కైలాసానికి చేరుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. పరమశివుడికి ప్రాణ సమానమైన కాశీ నగరానికి క్షేత్ర పాలకుడిగా 'కాలభైరవుడు' వ్యవహరిస్తూ ఉంటాడు.
తన అంశతో జన్మించిన కాలభైరవుడిని సాక్షాత్తు సదాశివుడే క్షేత్రపాలకుడిగా నియమించినట్టు స్థలపురాణం చెబుతోంది. అందుకు కారణమైన పురాణపరమైన కథ కూడా వినిపిస్తూ ఉంటుంది. పూర్వం శివకేశవుల కంటే తానే అధికుడిననే అహంభావం బ్రహ్మదేవుడిలో పెరుగుతూపోతుంది. ఈ విషయంలో శివుడితో వాదనకి దిగి ఆయన ఆగ్రహావేశాలకు గురవుతాడు.
శివుడి అంశతో జన్మించిన కాలభైరవుడు, ఆయన ఆదేశం మేరకు బ్రహ్మదేవుడికి మధ్యలో గల శిరస్సును ఖండిస్తాడు. ఆ శిరస్సుతో పాటు బ్రహ్మదేవుడి అహంభావం కూడా తొలగిపోతుంది. అయితే బ్రహ్మహత్యాపాతకం నుంచి బయటపడే మార్గాన్ని సూచించవలసిందిగా శివుడిని కోరతాడు కాలభైరవుడు. సమస్త పుణ్యక్షేత్రాలను దర్శించి చివరిగా కాశీ క్షేత్రాన్ని చేరుకోమనీ, దాంతో పాపం నశిస్తుందని చెబుతాడు శివుడు.
అలా కాశీ నగరానికి చేరుకున్న కాలభైరవుడు బ్రహ్మ హత్యాపాతకం నుంచి బయటపడి, శివుడిచేత క్షేత్రపాలకుడిగా నియమించబడతాడు. ఆనాటి నుంచి కాలభైరవుడు తనని దర్శించిన వారిని గ్రహ సంబంధమైన పీడల నుంచి కాపాడుతూ, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ వస్తున్నాడు. ఈ కారణంగానే కాశీ వెళ్లిన ప్రతి ఒక్కరూ కాలభైరవుడిని కూడా దర్శించుకుంటూ ఉంటారు. ఆయన కరుణను కోరుకుంటూ .. అనుగ్రహాన్ని ఆశిస్తూ వుంటారు.