వంటచేసేలోగా చెక్కబడిన దేవతా శిల్పం !
అత్యంత విశిష్టమైనవిగా ... మహిమాన్వితమైనవిగా చెప్పబడుతోన్న 108 శైవ క్షేత్రాల్లో 'లేపాక్షి' ఒకటిగా చెప్పబడుతోంది. సీతను అపహరించుకు వెళుతోన్న రావణాసురుడిని జటాయువు అనే పక్షిరాజు అడ్డుకుంటుంది. రావణుడిని ఎదిరించే ప్రయత్నంలో అది దాని రెక్కలను కోల్పోయి కూలిపోతుంది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన శ్రీరామచంద్రుడు, లే .. పక్షి అంటూ దానికి ఆసరా ఇచ్చాడట. ఆ కారణంగా ఈ ప్రదేశానికి లేపాక్షి అనే పేరు వచ్చిందని చెబుతుంటారు.
లేపాక్షిలో పరమశివుడు ... పాపనాశేశ్వరుడు పేరుతో పూజలు అందుకుంటూ ఉంటాడు. ఈ క్షేత్రంలో ఆలయ ప్రాంగణం ... మంటపాలు ... స్తంభాలు ... ప్రతి రాయి కూడా శిల్పకళా శోభితమై కనిపిస్తుంటాయి ... కనువిందు చేస్తుంటాయి. ఈ క్షేత్రాన్ని పరిశీలిస్తే ఆనాటి శిల్పులు ఎంతటి ప్రతిభావంతులో అర్థమవుతుంది. ఇక్కడి శిలలపై చెక్కిన శిల్పాలు ఆనాటి చరిత్రను అందంగా చెబుతున్నట్టు అనిపిస్తుంది.
ఇక ఏడు తలలతో ఇక్కడ కనిపించే నాగదేవత శిల్పం ... చుట్టచుట్టుకున్న ఆ సర్పం మధ్యలో గల శివలింగం ఆనందాశ్చర్యాలను కలిగిస్తాయి. కొండరాయిలో ఒకవైపుని నాగదేవత పడగలా మలిచిన శిల్ప నైపుణ్యం ఔరా ! అనిపించక మానదు. ఇంతటి విశేషాన్ని తనలో దాచుకున్న ఈ శిల్పం వెనుక ఒక ఆసక్తికరమైన కథ దాగి ఉన్నట్టుగా చెబుతుంటారు.
ఆలయ నిర్మాణ సమయంలో కొంతమంది అన్నదమ్ములు ఇక్కడి శిల్పాలను మలుస్తూ ఉండేవాళ్లట. ఒకసారి వాళ్లు భోజనానికి ఇంటికి రాగా ... ఇంకాస్త సమయం పడుతుందని తల్లి చెప్పిందట. ఆ సమయంలోనే ఇక్కడి కొండరాయి వారి కంటపడింది. ఆ రాయిని నాగదేవతగా మలవాలనే ఆలోచన వచ్చింది. అంతే అనుకున్నదే తడవుగా అన్నదమ్ములు అంతా కలిసి, తల్లి అన్నం వండి వడ్డించేలోగా ఈ శిల్పాన్ని రూపొందించారు.
తన కొడుకుల ప్రతిభాపాటవాలు చూసి మురిసిపోయిన ఆ తల్లి, ఆ సర్పం మధ్యలో శివలింగం ఉంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందట. దాంతో అక్కడ శివలింగం కూడా ఏర్పాటు చేయబడిందని చెబుతారు. ఇక్కడ వినిపించే ఈకథలో నిజానిజాల సంగతి ఎలా ఉన్నా, ఆనాటి శిల్ప నైపుణ్యానికి ఇది అద్దం పడుతూ ఉంటుంది. ఆధ్యాత్మిక భావాలను వికసింపజేయడంలో ప్రధానమైన పాత్రను పోషిస్తూ ఉంటుంది.