రెండు పూటలా దీపారాధన చేస్తే కలిగే ఫలితం ?
భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి ... గతంలో ఆయన అందించిన సహాయసహకారాలకి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి పూజ చేయడం జరుగుతూ ఉంటుంది. ఉదయాన్నే స్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి, ఎవరికి వారు తమ ఇష్టదైవాలను పూజిస్తూ ఉంటారు. అయితే దైవమేదైనా ... పూజ ఏదైనా అది దీపారాధన చేయడంతోనే మొదలవుతుంది.
దీపం సకలదైవ స్వరూపమనీ ... భగవంతుడు జ్యోతి స్వరూపంగానే ఈ భూమిపై అవతరించాడని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. జ్యోతి స్వరూపుడైన భగవంతుడిని దర్శించడం వలన, మనసులో ముసురుకున్న అజ్ఞానమనే చీకట్లు తొలగిపోతాయి. ఏది నిజం ... ఏది భ్రమ అనే విషయం తెలిసేది వెలుగులోనే. ఆ సత్యాన్ని చాటిచెప్పడం కోసమే భగవంతుడు జ్యోతి స్వరూపుడిగా ఆవిర్భవించాడు. ఆ రూపాన్ని ఆరాధించడం కోసమే దీపారాధన చేస్తుంటారు.
ఇందువలన సంపదలు పెరుగుతాయి ... శుభాలు కలుగుతాయి ... ఆయురారోగ్యాలు ప్రాప్తిస్తాయి. అయితే కొంతమంది ఉదయం పూట మాత్రమే దీపారాధన చేస్తుంటారు. సాయంత్రం పూట పూజా మందిరం వైపు వెళ్లరు. తీరిక లేకపోవడమో ... ఆసక్తి లేకపోవడమో అందుకు కారణంగా భావించవచ్చు. ఒక పూట దీపారాధన వలన ఎలాంటి దోషం లేకపోయినా, పరిపూర్ణమైన ఫలితం కోసం ప్రతి నిత్యం రెండు పూటలా దీపారాధన చేయాలని శాస్త్రం చెబుతోంది.
ఉదయాన్నే సూర్యోదయానికి ముందు ... సాయంత్రం సూర్యాస్తమయం తరువాత దీపారాధన చేయాలని శాస్త్రం అంటోంది. అంటే ఎప్పుడూ కూడా వెలుగులోనే మానవ జీవన విధానం కొనసాగాలనే సత్యాన్ని ఈ నియమం చెబుతోంది. చీకట్లో స్నానం చేయకూడదు ... భోజనం చేయకూడదు ... నిద్రించకూడదు అని పెద్దలు చెప్పే మాటకు అర్థం ఇదే. రెండు పూటలా చేసే దీపారాధన వలన భగవంతుడి సమీపంలో ఎక్కువసేపు గడిపినట్టు అవుతుంది. ఆ వెలుగును ఆశ్రయించి వున్న అనేక దైవశక్తుల ఆశీస్సులను ... అనుగ్రహాన్ని పొందినట్టు అవుతుంది.