వేదనలు తీర్చు వేంకటేశ్వరుడు
గర్భాలయంలో నిండుగా ... కనుల పండుగగా ... కొండంతవాడిగా కనిపించే వేంకటేశ్వరస్వామిని చూడగానే వేదనలన్నీ మరిచిపోవడం జరుగుతుంది. సమస్త లోకాలు తన పాదాల చెంతనే ఉన్నాయనీ, తన చరణాలను శరణంటూ ఆశ్రయించినవారికి సకల శుభాలు చేకూరతాయని స్వామి వరద హస్తం సూచిస్తూ ఉంటుంది. వెనుకటి జన్మల పాపాల ఫలితాలను బట్టి ఆపదలు తరుముకొచ్చినా, అవి వేంకటేశ్వరుడి నామస్మరణంతో అవలీలగా తొలగిపోతుంటాయి.
ఈ కారణంగానే ఆ స్వామి ఆలయాలు భక్తజన సందోహంతో కిటకిటలాడుతూ ఉంటాయి. ఇలా భక్తజన వాహినితో నిత్య నీరాజనాలు అందుకుంటోన్న క్షేత్రం నల్గొండ జిల్లాలోని 'కనుముక్కుల' గ్రామంలో దర్శనమిస్తుంది. వేంకటేశ్వరస్వామి భారీ తనానికీ ... వైభవానికి తగినట్టుగా ఈ ఆలయ నిర్మాణం జరిగింది. గర్భాలయంలో స్వామివారి మూలమూర్తి అద్భుతమైన సౌందర్యాన్ని ఆవిష్కరిస్తూ ఉంటుంది. భగవంతుడు ఇచ్చిన చూపుకు ఇన్నాళ్లకు సార్థకత లభించినట్టు అనిపిస్తుంది.
స్వామివారి గర్భాలయం పక్కనే పద్మావతీ అమ్మవారు ... గోదాదేవి అమ్మవారు ప్రత్యేక మందిరాలలో కొలువై ఉంటారు. స్వామివారి నుంచి ఆ కాస్త ఎడబాటును కూడా తట్టుకోలేకపోతున్నట్టుగా అమ్మవార్లు కనిపిస్తుంటారు. భగవంతుడి స్పర్శ కారణంగా ఇక్కడి నేల పవిత్రమై, భక్తులకు ప్రశాంతతను అందిస్తూ ఉంటుంది. విష్ణు నామ స్మరణతో విధిని సైతం ఎదిరించవచ్చని నిరూపిస్తున్నట్టుగా ఇక్కడ హనుమంతుడు దర్శనమిస్తూ ఉంటాడు. క్షేత్రపాలకుడిగా హనుమంతుడే ఇక్కడి వ్యవహారాలను పర్యవేక్షిస్తూ ఉంటాడు.
విశేషమైనటువంటి పుణ్య తిథుల్లో ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది. ఈ సందర్భంగా ఉత్సాహంతో జరిపే వేడుకలను తిలకించడానికి వేలకళ్లు కావాలి. ఈ జీవము నీదే ... మా భారమూ నీదే అన్నట్టుగా భక్తులు స్వామివారికి నమస్కరించుకుని ... మొక్కుబడులు చెల్లించుకుని ... ఆ దివ్య మంగళ రూపాన్ని మనసులో భద్రపరచుకుని వెళుతుంటారు.