గర్భగుడి దాటి వచ్చిన తిరుమలేశుడు !
తిరుమలలో అడుగుపెట్టిన వెంగమాంబ నిరంతరం ఆ వేంకటేశ్వరస్వామిని ధ్యానిస్తూ ఉండేది. ఆ స్వామిని అంకితభావంతో అర్చిస్తూ ... కీర్తిస్తూ అనేక రచనలు చేస్తూ ఉండేది. కొంతమంది ఈర్ష్యాద్వేషాల కారణంగా ఆమె ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. స్వామి అనుగ్రహం కారణంగా వాటిని ఆమె ఎదుర్కుంటూ, అన్నమాచార్యులవారి వంశీకుల ఆశ్రయాన్ని పొందుతుంది.
అయితే తాను అనునిత్యం స్వామివారికి సమర్పించే 'ముత్యాల హారతి' సేవ తన తదనంతరం ఎవరు సమర్పిస్తారనే ఆలోచన ఆమెకి కలుగుతుంది. తాను తనువు చాలించడం వలన 'ముత్యాల హారతి' సేవ ఆగిపోకూడదని అనుకుంటుంది. ఈ విషయంలో ఏం చేయాలో పాలుపోక ఏడుస్తూ కూర్చుంటుంది. ఆమె ఆందోళన ఆ వేంకటేశ్వర స్వామిని కదిలించడంతో ఆయన నేరుగా ఆమె దగ్గరికి వస్తాడు.
తనకి అనునిత్యం ఆమె జరుపుతోన్న ముత్యాల హారతి సేవ ఆగిపోదనీ, అనవసరంగా దిగులు పడవద్దని చెబుతాడు. కలకాలం ఆమె ముత్యలహారతి కొనసాగుతుందంటూ కన్నీళ్లు తుడుస్తాడు. ఆమె వంశానికి చెందిన కుటుంబం నుంచి ఒకరిని దత్తత తీసుకుని, వారి ద్వారా తన సేవను కొనసాగించమని సూచిస్తాడు. స్వామి వారు ఇచ్చిన సలహాను వెంగమాంబ వెంటనే ఆచరణలో పెడుతుంది.
ఆనాటి నుంచి ఈనాటి వరకూ ఆమె వంశస్తులే .. ప్రతి రోజు రాత్రి స్వామివారి ఏకాంత సేవ సమయంలో 'ముత్యాల హారతి' ని సమర్పిస్తూ వస్తున్నారు. అలా అసమానమైన భక్తితో ఆ వేంకటేశ్వరస్వామి అనుగ్రహాన్ని వెంగమాంబ పొందగలిగింది. ఆమె చేసుకున్న పుణ్యఫల విశేషం కారణంగా ఆమె వంశానికి చెందినవారికి తరతరాలుగా స్వామివారి సేవ చేసుకునే మహద్భాగ్యం లభించింది.