ఉండ్రాళ్ల తద్ది
ఆధునీకత పేరుతో సమాజం ఎన్ని కొత్త పుంతలు తొక్కుతున్నా, స్త్రీలు తమ భక్తి శ్రద్ధలతో మన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుతూనే వస్తున్నారు. ఈ నేపథ్యంలో స్త్రీలకు మంచి జీవితాన్ని ప్రసాదించే నోముల్లో 'ఉండ్రాళ్ల తద్ది'కూడా ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇక ఈ నోము భాద్రపద మాసంలో పౌర్ణమి వెళ్లిన మూడవ రోజున (బహుళ తదియ) నోచుకోవాలని సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీదేవితో చెప్పాడనేది పెద్దలమాట.
భాద్రపద తృతీయ రోజున సూర్యోదయానికి ముందుగానే తల స్నానం చేసి, గౌరీదేవికి మనస్ఫూర్తిగా పూజ చేసి రాత్రి వండిన పదార్ధాలను ఐదుగురు ముత్తయిదువులతో కలిసి భుజించాలి. ఇక అప్పటి నుంచి ఆ రోజు సూర్యాస్తమయం వరకూ పాలు ... రసాలు మాత్రమే తీసుకుంటూ ఉండాలి. ఆ తరువాత అమ్మవారిని శక్తి కొలది పూజించి ఆమెకి కొత్త వస్త్రాలతో పాటు 'ఉండ్రాళ్లు' సమర్పించాలి. పేరంటాళ్లను ఆప్యాయంగా ఆహ్వానించి వారి పాదాలకు పసుపు రాసి వారితో అక్షింతలు వేయించుకుని ఆశీస్సులు తీసుకోవాలి. పూజ అనంతరం అయిదు ముడులు వేసిన తోరమును ... అయిదు ఉండ్రాళ్ళను ... దక్షిణ తాంబూలాలను అయిదుగురు ముత్తయిదువులకు వాయనమివ్వాల్సి ఉంటుంది.
ఇక ఈ నోము విధానాన్ని స్త్రీలు ఎలాగైనా తెలుసుకుని ఆచరించాలనే ఉద్దేశం ప్రతిబింబించేలా ఓ చారిత్రక కథ కూడా కనిపిస్తోంది. పూర్వం ఓ రాజుగారికి ఏడుగురు భార్యలు వుండేవారు. సహజంగానే రాజు గారు చిన్నరాణి చిత్రాంగి పట్ల ఎక్కువ ప్రేమాభిమానాలు చూపించేవాడు. దాంతో చిత్రాంగి అంటే మిగతా రాణులకు అసూయ ఏర్పడటంతో వాళ్లంతా ఆమెను వేరుగా చూడసాగారు.
ఈ నేపథ్యంలోనే వాళ్లంతా చిత్రాంగికి తెలియకుండా 'ఉండ్రాళ్ల తద్ది' నోమును నోచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం చిత్రాంగి వరకూ వెళ్లడంతో, ఆమె ఈ నోము విధి విధానాలు తెలుసుకుని అయిదేళ్ల పాటు భక్తి శ్రద్ధలతో ఆచరించింది. మిగతా రాణులకంటే ముందుగానే అమ్మవారి అనుగ్రహాన్ని సంపాదించి వాళ్లని ఆశ్చర్య పరిచింది. మంచి మనసుతో చేసే పూజకు ఫలితం త్వరగా లభిస్తుందనే విషయాన్ని నిరూపించింది.