ఆచమనీయం అర్థం ఏమిటి ?
సమస్త జీవకోటి ఆ భగవంతుడికి రుణపడి ఉంది. ప్రకృతి ద్వారా సమస్త జీవరాశికి అవసరమైనవి అమర్చేది ఆ భగవంతుడే. అందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకునే శక్తి ఒక్క మానవాళికి మాత్రమే ఉంది. ఈ కారణంగానే చాలామంది భగవంతుడు సమకూర్చిన వాటిపట్ల సంతృప్తి చెందుతూ ... సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకోవడంలో భాగంగానే ఆయనకి పూజాభిషేకాలు నిర్వహించడం జరుగుతుంది.
ఈ నేపథ్యంలోనే భగవంతుడిని పదహారు రకాల ఉపచారలతో ఆరాధించాలనే నియమం చేయబడింది. ఆవాహనం .. ఆసనం .. పాద్యం .. అర్ఘ్యం .. ఆచమనీయం .. స్నానం .. వస్త్రం .. యజ్ఞోపవీతం .. గంధం .. పుష్పం .. ధూపం .. దీపం .. నైవేద్యం .. తాంబూలం .. నీరాజనం .. ఆత్మప్రదక్షిణ అనేని షోడశ ఉపచారాలుగా వరుస క్రమంలో నిర్వహించవలసి ఉంటుంది. అయితే ఈ ఉపచారాల్లో 'ఆచమనీయం' అంటే ఏమిటో ... దాని వెనుక గల అర్థమేమిటో చాలామందికి తెలియదనే చెప్పాలి.
ఈ కారణంగానే పూజలో భాగంగా ఆచమనీయం అని చెప్పి ఉద్ధరిణతో నీళ్లు చేతికి ఇచ్చినప్పుడు చాలామంది దానిని తీర్థంగా తీసుకోవాలో ... చేతులు కడుక్కోవాలో తెలియక తికమకపడిపోతుంటారు. ఓం కేశవాయ స్వాహా .. ఓం నారాయణాయ స్వాహా ... ఓం మాధవాయ స్వాహా అని ప్రతి సారి ఇచ్చిన తీర్థ జలాన్ని లోపలికి తీసుకోవాలి. ఆ తరువాత ఇచ్చిన జలంతో చేతులు శుభ్ర పరచుకోవాలి. ఈ విధంగా మూడుమార్లు లోపలికి తీర్థ జలాన్ని తీసుకోవడం వలన ప్రయోజనమేమిటనే సందేహం చాలామందికి కలుగుతుంటుంది.
సాధారణంగా పూజ చేయడానికి ముందు స్నానం చేయడం జరుగుతుంటుంది. దీని వలన శరీరపరమైన శుభ్రత కలుగుతుంది. ఇక అంతరంగ శుద్ధి ... ఆత్మ శుద్ధి కలగవలసిన అవసరం కూడా ఉంది. అలా ఆత్మశుద్ధి కలగాలంటే ఆచమనం చేయాలని శాస్త్రం చెబుతోంది. భగవంతుడి నామాన్ని స్మరిస్తూ పవిత్రమైన జలాన్ని లోపలికి తీసుకోవడం వలన ఆత్మశుద్ధి కలుగుతుందనీ, ఆత్మశుద్ధితో చేసిన పూజ వలన దోషరహితమైన ఫలితం దక్కుతుందని చెప్పబడుతోంది.