పాతాళ గంగను పైకి తెచ్చిన స్వామి
తమిళనాడు ప్రాంతంలో ఆవిర్భవించిన కుమారస్వామి క్షేత్రాల్లో ఆరు క్షేత్రాలు అత్యంత విశిష్టమైనవిగా చెబుతుంటారు. ఈ జాబితాలో తిరుప్పరం కున్రం ... పళని ... తిరుచ్చెందూర్ .. స్వామిమలై ... తిరుత్తణి ... పళముదిర్ చోళై క్షేత్రాలు కనిపిస్తాయి. ఈ ఆరు ప్రసిద్ధ క్షేత్రాల్లో 'తిరుప్పరం కున్రం' క్షేత్రం ఎంతో ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంది.
దేవేంద్రుడి కుమార్తె అయిన దేవసేనను కుమారస్వామి వివాహం చేసుకున్నది ఇక్కడేనని స్థలపురాణం చెబుతోంది. సాధారణంగా కుమారస్వామి ప్రతి క్షేత్రంలోను నుంచుని దర్శనమిస్తూ ఉంటాడు. అందుకు భిన్నంగా ఈ ఒక్క క్షేత్రంలో స్వామివారు కూర్చుని భక్తులను అనుగ్రహిస్తుంటాడు. ఇక ఈ ప్రధానమైన మూర్తికి కాకుండా శూలానికి అభిషేకాలు జరపడం కూడా ఇక్కడి ప్రత్యేకతగా చెబుతుంటారు.
ఇంతటి పురాణ నేపథ్యం గల ఈ క్షేత్రంలో, మరో మహిమాన్వితమైన సంఘటన కూడా జరిగింది. ఈ క్షేత్రంలో గల గంగా తీర్థం ... స్వామివారు సృష్టించినదేనని చెబుతుంటారు. పూర్వం 'నక్కీరుడు' అనే భక్తుడు ఈ ప్రాంతంలో గల ఓ రాక్షసి బారినపడతాడు. ఆ రాక్షసి అతణ్ణి బలి ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటుంది. స్వామి రక్షిస్తాడనే విశ్వాసంతో నక్కీరుడు ధైర్యంగా ఉంటాడు. ఆ రాక్షసి అతణ్ణి బలి ఇవ్వబోతుండగా కుమారస్వామి వచ్చి ఆ రాక్షసిని సంహరిస్తాడు.
తనని రాక్షసి తాకిన దోషం నుంచి బయటపడవేయవలసిందిగా నక్కీరుడు కోరడంతో, కుమారస్వామి తన శూలంతో నేలను తట్టగా అక్కడి పాతాళ గంగ పైకి వస్తుంది. ఆ జలధారల్లో స్నానమాచరించిన నక్కీరుడు, స్వామిని సేవించి తరించినట్టు స్థలపురాణం చెబుతోంది. ఇందుకు సంబంధించిన ఆనాటి ఆనవాళ్లు ఈనాటికీ ఇక్కడ దర్శనమిస్తూ ఉంటాయి. మహిమాన్వితమైన ఈ క్షేత్రంలో అడుగుపెట్టినంత మాత్రానే సమస్త దోషాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తుంటారు.