భర్త ప్రాణాలను దక్కించుకున్న ఇల్లాలు
సత్యవంతుడు అల్పాయుష్కుడని తెలిసి సావిత్రి ఎన్నో పూజలు చేస్తుంది. తన మాంగల్యాన్ని రక్షించమని పార్వతీదేవిని అనుదినం అర్చిస్తుంది. అయినా సమయం రాగానే సత్యవంతుడి ప్రాణాలను హరించి వేస్తాడు యమధర్మరాజు. సత్యవంతుడి ప్రాణాలను తీసుకువెళుతున్న అతణ్ణి సావిత్రి కన్నీళ్లతో అనుసరిస్తుంది. అది గమనించిన యమధర్మరాజు ఆశ్చర్యపోతాడు.
జీవుల ఆయువు తీరగానే తీసుకువెళ్లడం తన విధి అనీ, తన వెంట ఎంత దూరం వచ్చినా ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆమెతో చెబుతాడు. నరకానికి వెళ్లే మార్గం అత్యంత భయంకరంగా ఉంటుందనీ, అందువలన వెనుదిరిగిపొమ్మని అంటాడు. తన భర్త ప్రాణాలతో లేనప్పుడు తాను వెనుదిరిగి వెళ్లి చేసేది ఏమీ లేదంటూ అతణ్ణి అనుసరిస్తుంది సావిత్రి.
సూక్ష్మ శరీరంతో మాత్రమే దాట గల 'వైతరణీ' నదిని ఆమె అవలీలగా దాటి రాగలగడం చూసి యమధర్మరాజు నివ్వెరపోతాడు. ఆమె సామాన్యురాలు కాదని గ్రహిస్తాడు. సావిత్రి మనసును ఉపశమింపజేయడం కోసం, ఏదైనా వరం కోరుకుంటే ఇస్తానని అంటాడు. దాంతో తనకి పుత్ర సంతనాన్ని అనుగ్రహించమని ఆమె కోరుతుంది. అందుకు యమధర్మరాజు అంగీకరించడంతో, భర్త లేకుండా సంతానాన్ని పొందడం ఎలా సాధ్యమంటూ నిలదీస్తుంది.
తాను ఇచ్చిన వరం సఫలం కావాలంటే సత్యవంతుడిని బతికించక తప్పదు. అలాగని చెప్పి ఇచ్చిన వరాన్ని వెనక్కి తీసుకుంటే లోకం హర్షించదు. అంతటి దుఃఖంలోను తనని తికమక పెట్టిన సావిత్రి తీరు ఆయనకీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆమె పాతివ్రత్యాన్ని ... సమయస్ఫూర్తిని యమధర్మరాజు అభినందిస్తాడు. సత్యవంతుడి శరీరంలోకి అతని ప్రాణాలను తిరిగి ప్రవేశపెడతాడు. అలా పాతివ్రత్యం చేత పతిప్రాణాలను దక్కించుకున్న ఇల్లాలుగా సావిత్రి చరిత్రలో నిలిచిపోయింది.