కోటి వరాలనిచ్చే కోదండ రాముడు
శ్రీమహావిష్ణువు ధరించిన దశావతారాలలో రామావతారానికి ఎంతో విశిష్టత ఉంది. ఆదేశాలు ... సూచనలు ప్రజలను ధర్మ మార్గంలో నడిపించలేవని గ్రహించిన భగవంతుడు, ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం తాను మానవుడిగా జన్మించాడు. ఏది ధర్మం ... ఏది అధర్మం ... అనే విషయాన్ని లోకానికి చాటి చెప్పడానికీ, ధర్మాన్ని అనుసరించడం వలన అంతిమంగా విజయం చేకూరుతుందనే విశ్వాసం కలిగించడానికి రాముడు పడిన కష్టాలు అన్నీ ఇన్నీకావు.
ఈ కారణంగానే రామావతారంలో భగవంతుడు ప్రజల మనసుకు మరింత చేరువయ్యాడు. మాఊరి దేవుడు .. శ్రీరామచంద్రుడు అని ప్రతి ఒక్కరూ చెప్పుకునేలా గ్రామగ్రామాన కొలువుదీరాడు. పశ్చిమ గోదావరి జిల్లా 'నరసాపురం' లో గల రామాలయం ఈ నేపథ్యంలోనిదేనని చెప్పొచ్చు. 19 వ శతాబ్దం తొలినాళ్లలో ఇక్కడ సీతారాములు చిన్న మందిరంలో ఉండేవారు.
స్థానికులు రాములవారిని మరింత వైభవంగా చూసుకోవాలనుకుని, ఆ విషయాన్ని జమీందార్ అచ్యుత రామయ్య దృష్టికి తీసుకువెళ్లారు. సహజంగానే భక్తిపరుడైన ఆయన గ్రామస్తుల కోరిక మేరకు స్వామివారికి ఆలయాన్ని నిర్మించాడు. భద్రాచలంలో మాదిరిగానే ఇక్కడ స్వామివారికి ప్రత్యేక పూజలు ... సేవలు జరిగేలా తగిన ఏర్పాట్లు చేశాడు. ఇక ఆలయ నిర్మాణం కోసం పునాదులు తవ్వుతుండగా ఒక అద్భుతం జరిగిందని చెబుతుంటారు.
అందరూ చూస్తుండగానే నామాలు కలిగిన ఒక 'శ్వేత వరాహం' పరిగెత్తుకుంటూ వచ్చి, పునాదుల కోసం తవ్విన గోతిలోకి ప్రవేశించి అదృశ్యమైందట. దాంతో తాము తలపెట్టిన కార్యక్రమానికి భగవంతుడి ఆదేశం కూడా అయినట్టుగా భావించి నిర్మాణాన్ని పూర్తి చేశారట. నాటి నుంచి ఈ ఆలయం అంచలంచెలుగా అభివృద్ధి చెందుతోంది. ప్రతియేటా ఇక్కడ ఘనంగా జరిగే శ్రీరామనవమి ఉత్సవాలను చూసి తీరవలసిందే. ఈ సందర్భంగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. సీతారాముల కల్యాణాన్ని కనులారా తిలకిస్తూ కట్నకానుకలు సమర్పిస్తూ ఉంటారు.