బల్లిపాటు దోషాలను తొలగించే దివ్యక్షేత్రం
పుణ్యక్షేత్రాలు అనగానే అక్కడ అత్యధిక సంఖ్యలో భక్తులు కనిపిస్తుంటారు. నిరంతరం వచ్చిపోయే వారితో అక్కడి వాతావరణం ఎప్పుడూ సందడిగా కనిపిస్తూ ఉంటుంది. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించేందుకు ... ఆధ్యాత్మిక చింతనలో తరించేందుకు కొంతమంది క్షేత్రదర్శనం చేస్తుంటారు. మరికొందరేమో తమ కష్టనష్టాలు చెప్పుకోవడానికి ... దోషాల బారి నుంచి బయటపడటానికి వస్తుంటారు.
ఈ నేపథ్యంలో ఒక్కో క్షేత్రానికి ఒక్కో ప్రత్యేకత కనిపిస్తూ ఉంటుంది. అలా 'బల్లిపాటు దోషం' పోగొట్టే ప్రత్యేకతను కలిగిన క్షేత్రంగా 'వెల్లూర్ ' కనిపిస్తుంది. విజయనగర రాజుల పరిపాలనా ప్రభావం కారణంగా దీనిని 'రాయవెల్లూర్' గా కూడా పిలుస్తుంటారు. తమిళనాడు ప్రాంతానికి చెందిన ఈ క్షేత్రంలో అఖిలాండేశ్వరీ సమేత జలకంఠ ఈశ్వరుడు దర్శనమిస్తూ ఉంటాడు.
పూర్వం భద్రాచలం ప్రాంతానికి చెందిన ఓ భక్తుడు ఇక్కడి ప్రదేశంలో నిద్రించినప్పుడు, కలలో స్వామివారు కనిపించి తన స్వయంభువు లింగం ఆనవాలును చెప్పినట్టు స్థలపురాణాన్ని బట్టి తెలుస్తోంది. నిధితో పాటు కంఠంలోతు నీటిలో లభించిన కారణంగా ఇక్కడి స్వామికి ఈ పేరు వచ్చిందని అంటారు. ఆ నిధితోనే ఆ భక్తుడు స్వామివారికి ఆలయాన్ని నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది. ఆ తరువాత వచ్చిన ఎందరో రాజులు ఇక్కడి స్వామి మహిమ అనుభవంలోకిరాగా, ఆలయ అభివృద్ధికి తమవంతు కృషి చేసినట్టు ఆధారాలు ఉన్నాయి.
ఇక ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటుచేయబడిన 'బల్లిమంటపం' విశిష్టమైనదిగా చెబుతుంటారు. బల్లిపాటు వలన కలిగే దుష్ఫలితాలు, ఈ మంటపంలో చెక్కబడిన బల్లిరూపాలను తాకడం వలన నివారించబడతాయని చెప్పబడుతోంది. సుదీర్ఘమైన వ్యాధులను ... గ్రహసంబంధమైన దోషాలను కూడా ఈ క్షేత్ర దర్శనం దూరం చేస్తుంది. అందువలన ఈ క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. ఈ ప్రాంగణంలో గల అనేక ఉపాలయాలను దర్శించడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. అద్భుతమైన క్షేత్రాన్ని దర్శించిన అనుభూతి మిగులుతుంది.