ఆలయ ప్రాంగణంలో ఆసక్తిని రేకెత్తించే శిల్పం !
అనంతమైన ఈ విశ్వాన్ని అదృశ్యరూపంలో నడిపిస్తోన్న శక్తి పేరే దేవుడనే విశ్వాసం ప్రాచీనకాలం నుంచి ఉంది. మంచైనా చెడైనా అది ఆ దేవుడి ఆదేశంమేరకే జరుగుతుంది ... అదే విధి! అనే నమ్మకం కూడా అనాదికాలం నుంచి వస్తున్నదే. ఈ కారణంగానే భగవంతుడి పట్ల భయభక్తులు ఏర్పడుతూ వచ్చాయి.
ఫలానా విషయంలో దేవుడుచేసిన నియమం ... ఆదేశం అని తెలిసినప్పుడు వాటిని అధిగమించడానికి ఎవరూ కూడా సాహసించరు. ఈ విషయంలో ఎవరైనా మూర్ఖత్వంతో ముందుకువెళితే అందుకు తగిన ఫలితాన్ని అనుభవించక తప్పదని కొన్ని సంఘటనలు నిరూపిస్తూ ఉంటాయి. అలాంటి చిత్రమైన సంఘటన ఒకటి నిజామాబాద్ లోని 'హుసేన్ నగర్' లో జరిగినట్టుగా చెబుతారు.
పూర్వం ఇది శ్రీరాముడు నడయాడిన ప్రదేశంగా ఇక్కడి స్థలపురాణం చెబుతోంది. శ్రీరాముడు ఇక్కడి జలాశయంలో స్నాన మాచరించి, ఆ పక్కనే ఇసుకతో శివలింగాన్ని చేసి ప్రతిష్ఠించి పూజించాడట. ఈ కారణంగానే ఇక్కడి స్వామిని రామేశ్వరుడుగా కొలుస్తుంటారు. శ్రీరాముడు స్నానంచేసిన పుష్కరిణిని ఆనాటి ప్రజలు మహిమాన్వితమైనదిగా భావిస్తూ పూజించేవారు. ఇక్కడి నీటిలోని జలచరాలను పట్టరాదనీ, అది దేవుడి ఆదేశమని నమ్మేవారు.
అయితే ఆ విశ్వాసాన్ని పట్టించుకోకుండా ఒక వ్యక్తి ఈ పుష్కరిణిలో చేపలు పట్టడానికి వచ్చి శిలగా మారిపోయాడనే కథనం ఇక్కడ వినిపిస్తూ ఉంటుంది. అందుకు నిదర్శనంగా చేపలు పడుతున్నట్టుండే వ్యక్తి ప్రాచీన శిల్పం ఇక్కడ కనిపిస్తుంటుంది. ఈ కథనంలో నిజానిజాల మాటెలా ఉన్నా, ఈ క్షేత్రంలో గల పుష్కరిణి పవిత్రతను ... మహిమను ప్రస్తావించే సమయంలో భక్తులు ఈ సంఘటన గురించి ఆసక్తిగా చెప్పుకుంటూ ఉంటారు.