కరిగిపోయి భక్తులను కరుణించే శివుడు
క్షమించడంలోను ... కరిగిపోయి కరుణించడంలోను పరమశివుడు ఎప్పుడూ ముందేవుంటాడు. అపారమైనటువంటి భక్తిశ్రద్ధలతో తన మనసు గెలుచుకున్న భక్తులను అభినందించడంలోను ... అనుగ్రహించడంలోను ఆయన ప్రత్యేకతను కలిగివుంటాడు. ఇతరులకు అమృతాన్ని అందించడం కోసం తాను విషాన్ని తాగిన శివుడిని, అసమానమైన భక్తితో అర్చించిన నాయనార్లలో 'వాగీశ నాయనార్' ఒకరు. దక్షిణ ఆర్కాట్ ప్రాంతానికి చెందిన ఈ మహా భక్తుడి అసలుపేరు మరుణీక్కుయర్.
తల్లిదండ్రులను కోల్పోయిన ఆయన తీవ్రమైన నిరాశా నిస్పృహలకి లోనవుతాడు. తన తల్లిదండ్రులు నిరంతర శివనామ స్మరణతో గడిపినా ఆ దేవదేవుడు కనికరించలేదని బాధపడతాడు. తనని పట్టించుకోని శివుడిని తానెందు ఆరాధించాలనే ఉద్దేశంతో మతం మార్చుకుంటాడు. ఆ క్షణం నుంచి ఆయనను అనారోగ్యం వెంటాడటం మొదలు పెడుతుంది. దాంతో ఆయన మనసు మార్చుకుని తిరిగి శివారాధనని ఆరంభిస్తాడు.
అనతికాలంలోనే ఆయన పూర్తి ఆరోగ్యాన్ని పొంది, అత్యంత భక్తి శ్రద్ధలతో శివుడిని సేవిస్తూ ఉంటాడు. ఆయన స్తుతులు వెదజల్లే పరిమళానికి పరమశివుడు పరవశించిపోతాడు. ఆ మహా భక్తుడి చెంత ప్రత్యక్షమై ఇక ముందు ఆయన 'వాగీశ నాయనార్' పేరుతో ప్రసిద్ధి చెందుతాడని వరాన్ని ఇస్తాడు. అయితే ఏ మతాన్ని కొత్తగా స్వీకరించి .. ఆ వెంటనే ఆ మతంలో నుంచి ఆయన బయటికి వచ్చాడో, ఆ మత పెద్దలు ఆయనపై కక్షగడతారు.
వాగీశ నాయనార్ పై ప్రతీకారం తీర్చుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తారు. ద్వేషంతో వాళ్లు చేసిన ప్రతి ప్రయత్నాన్ని పరమశివుడు అడ్డుకుంటాడు. వాళ్లు సృష్టించిన ప్రతి ఆపద నుంచి వాగీశ నాయనార్ ను రక్షిస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని కాస్త ఆలస్యంగా గ్రహించిన ఆ మత పెద్దలు, తప్పు తెలుసుకుని తమ కుటిల ప్రయత్నాలను విరమించుకుంటారు. వాగీశ నాయనార్ ను ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఎంతోమంది శివభక్తులుగా మారిపోతారు.