దోషాలను తొలగించే వేంకటేశ్వరుడు
వివిధ దోషాల నుంచి బయటపడాలనుకునే వాళ్లు శివాలయాలకుగానీ, సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలకుగాని వెళుతుంటారు. ఈ రెండు దేవాలయాలు అందుబాటులో లేని వాళ్లు ఆంజనేయస్వామి ఆలయాలను దర్శిస్తుంటారు. ఈ నేపథ్యంలో దోషాలను తొలగించే వేంకటేశ్వర స్వామి వారి క్షేత్రం కూడా ఒకటి కనిపిస్తుంది. అదే కర్ణాటక ప్రాంతానికి చెందిన 'గడిదం'.
పూర్వకాలంలో భీముడు - హిడింబి కుమారుడైన ఘటోత్కచుడు ఈ ప్రాంతంలో నివసించాడనీ, ఈ కారణంగానే ఈ ఊరికి ఈ పేరు వచ్చిందని చెబుతుంటారు. ఇక ఇక్కడి వేంకటేశ్వరుడు దోషాలను తొలగించడమనే ప్రత్యేకతను కలిగి ఉండటానికి ఒక కారణముంది. పూర్వం 'సర్పయాగం' చేసిన జనమేజయుడు ఆ దోషానికి పరిహారంగా ఇక్కడి స్వామివారిని ప్రతిష్ఠించి పూజించాడట. ఫలితంగా ఆయన ఆ దోషాల నుంచి విముక్తుడయ్యాడని స్థలపురాణం చెబుతోంది.
ఈ కారణంగానే ఇక్కడి స్వామి దర్శనం మాత్రం చేతనే పాపాలు పరిహరించబడతాయనీ, దోషాలు దూరమవుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. కాలక్రమంలో ఇక్కడి స్థల మహాత్మ్యం గురించి తెలుసుకున్న చోళమహారాజులు, అన్ని రకాలుగా ఆలయాన్ని అభివృద్ధి చేయడంలో ప్రధానమైన పాత్రను పోషించారు. విశేషమైన చరిత్రను ... విశిష్టమైన స్థానాన్ని కలిగిన ఈ క్షేత్రంలో స్వామివారు శ్రీదేవి - భూదేవి సమేతంగా కొలువై భక్తులను అనుగ్రహిస్తుంటాడు.
జనమేజయుడు పశ్చాత్తాపానికి గుర్తుగా ఇక్కడ నాగదేవత దర్శనమిస్తుంటుంది. భక్తులతో పూజలందుకుంటూ ... తన ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటుంది. ఘనకీర్తిని సొంతం చేసుకున్న ఇక్కడి స్వామివారికి పర్వదినాల సమయంలో వైభవంగా వేడుకలు నిర్వహిస్తుంటారు. స్వామికి జరిగే ప్రత్యేక పూజల్లో ... సేవల్లో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొంటూ ఉంటారు. ఆయన చల్లని చూపుల వెన్నెలలో ధన్యత పొందుతూ ఉంటారు.