అడిగిన వరాలనిచ్చే అమ్మవారి ఆలయం
అమ్మవారు తనని అమ్మగా భావించే ప్రతిబిడ్డా క్షేమంగా ఉండేలా చూసుకుంటుంది. ఆపదల్లోను ... ఆర్ధికపరమైన ఇబ్బందుల్లోను పడనీయకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటుంది. తన బిడ్డల ఆలనాపాలన స్వయంగా చూసుకోవడం కోసమే ఆమె గ్రామగ్రామాన అవతరించింది. వివిధ రూపాలలో ... వివిధ నామాలతో కొలవబడుతూ అణువణువునా అమ్మతనాన్ని ఆవిష్కరిస్తూ ఉంటుంది. అలా అమ్మవారు 'ఎల్లమ్మతల్లి' గా ఆవిర్భవించిన క్షేత్రం మనకి మహబూబ్ నగర్ జిల్లాలోని 'పోలేపల్లి' లో కనిపిస్తుంది.
ఇక్కడి అమ్మవారు స్వయంభువు .... శిలగా కనిపిస్తూనే తన కదలికలను గ్రామస్తులు గుర్తించేలా వ్యవహరించింది. దాంతో అమ్మవారి ఉనికిని గుర్తించిన గ్రామస్తులు ఆ తల్లికి 'ఊడుగుచెట్టు' నీడలో ఒక మందిరాన్ని నిర్మించారు. ఆ పక్కనే గల గ్రామానికి చెందిన జాగిర్దార్, ప్రతిరోజూ అమ్మవారి మందిరం ముందుగా ఎడ్లబండిలో తన పొలానికి వెళ్లేవాడట. అయితే ఎడ్లబండి సరిగ్గా అమ్మవారి మందిరానికి ముందుగారాగానే ఆగిపోయేది.
ఈ విషయాన్ని ఆయన పరిచయస్తుల దగ్గర ప్రస్తావించి, అది అమ్మవారి మహిమేనని తెలుసుకుంటాడు. తనని సజావుగా తన పొలానికి ఎడ్లబండిపై వెళ్లనిస్తే ఆలయం నిర్మిస్తానని మొక్కుకున్నాడు. ఆ మరునాటి నుంచి ఆయన బండి అక్కడ ఆగలేదు. దాంతో అమ్మవారి మనసును అర్థం చేసుకున్న ఆ జాగీర్దార్ ఆ తల్లికి ఆలయాన్ని నిర్మించాడు. ఆనాటి నుంచి అమ్మవారి మహిమ మరింతగా జనంలోకి వెళ్లడంతో, ఆలయానికి భక్తుల రాక పెరుగుతూ వస్తోంది.
ఇక్కడి అమ్మవారు పాడిపంటలను ... పసుపు కుంకుమలను కాపాడుతుందని భక్తులు విశ్వసిస్తుంటారు. ప్రతియేటా ఇక్కడ జరిగే జాతరకు చుట్టుపక్కల గ్రామాల నుంచి అత్యధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అమ్మవారికి అంకితభావంతో బోనాలు సమర్పిస్తూ ఆ తల్లి ఆశీస్సులను పొందుతుంటారు.