వావిలి లక్ష్మీవారపు నోము
సంపద సమాజంలో గౌరవాన్ని తీసుకు వస్తుంది ... పేదరికం అవమానాలను అనుభవంలోకి తీసుకువస్తుంది. అందుకే అంతా పేదరికానికి భయపడుతుంటారు ... దాని బారినుంచి తప్పించుకోలేక పోతే బాధపడుతుంటారు. ఈ నేపథ్యంలో 'వావిలి లక్ష్మీవారపు నోము' పేదరికానికి విరుగుడులా పనిచేస్తుందని పెద్దలు చెబుతూ వస్తున్నారు.
ఈ నోముకి సంబంధించిన కథలోకి వెళితే, పూర్వం ఓ గ్రామంలో ఓ ఉమ్మడి కుటుంబం వుండేది. ఆ కుటుంబంలో చిన్న కూతురుగా చెప్పబడుతోన్న యువతి తప్పితే, అంతా శ్రీమంతులే. ఈ కారణంగా మిగతా వారు ఆ యువతిని చులకన భావంతో చూడసాగారు. ఆమె భర్తకి సమాజంలో ఒక హోదా అనేది లేని కారణంగా, ఆమెను తమ ఇంట్లో జరిగే శుభ కార్యానికి కూడా పిలవలేదు.
పుట్టింట్లో శుభకార్యం రోజున తన ఇంట్లో ఆ పూటకి కూడా భోజనం లేని పరిస్థితుల్లో ఆమె వుంది. అది గమనించిన ఆ యింటి పెద్ద కోడలు బాధపడింది. ఆ రోజున ఆడపడుచు ఉపవాసం ఉండకూడదని భావించింది. 'వావిలి లక్ష్మీవారపు నోము'నోచుకున్న ఆమె, వెంటనే అడ్డెడు తవ్వెడు కడిగిన బియ్యాన్ని ... అడ్డెడు తవ్వెడు కడగని బియ్యాన్ని ఓ కొత్త చాటలో పోసింది. వావిలి చెట్టు కొమ్మను ... ఓ కొత్త రవికల గుడ్డను, దక్షిణ తాంబూలాలను అందులో వుంచి దానిపై పాత చాటను వుంచి గోడపై నుంచి చిన్న ఆడపడుచుకు వాయనాన్ని అందించింది.
ఆ వాయనాన్ని అందుకున్న ఫలితంగా ఆమె భర్తకు మంచి సంపాదనా మార్గం లభించింది. చాలా తక్కువకాలంలోనే ఆమె మిగతా వారిని మించిన ధనవంతురాలైంది. పుట్టింట్లో జరిగే మరో శుభ కార్యానికి ఈసారి ఆమెను రమ్మంటూ అంతా బలవంతం చేశారు. దాంతో గతంలో తనపట్ల వాళ్లు వ్యవహరించిన తీరును గుర్తు చేసి వాళ్ల కళ్లు తెరిపించింది. తాను శ్రీమంతురాలిని కావడానికి 'వావిలి లక్ష్మీ వారపు నోము' కారణమని ఆ సందర్భంలోనే ఆమె చెప్పింది.
ఏడాది పాటు ప్రతి లక్ష్మీవారం వావిలి చెట్టును గానీ ... కొమ్మను గాని 'గౌరీదేవి'గా భావించి పూజించాలని చెప్పింది. తన వదిన తనకి వాయన మిచ్చిన పద్ధతిలోనే వాయనమివ్వాలనీ, ఏడాది గడిచాక ఉద్యాపన చెప్పుకోవాలని వివరించింది. దాంతో మిగతా వాళ్లంతా కూడా ఆ వ్రతాన్ని చేయాలని నిర్ణయించుకున్నారు.