అదృశ్యమైన అమ్మవారు తిరిగి వచ్చింది !
ఏదైనా ఒక వస్తువు పెట్టినచోట కనిపించకుండాపోతే, నానాహడావిడి చేస్తూ దాని కోసం వెదకడం జరుగుతుంది. ఇంతా వెతికాక ఆ వస్తువు ఆ పక్కనే కనిపిస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోతారు. అంతవరకూ అది అక్కడ ఎందుకు కనిపించేలేదు? అనే విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా, మొత్తానికి దొరికింది కదా అని సరిపెట్టుకుంటూ ఉంటారు.
అలాంటిది శ్రీరంగం క్షేత్రంలో ... నాచియార్ గా పూజలు అందుకునే అమ్మవారు హఠాత్తుగా అదృశ్యమైపోయి కొన్ని సంవత్సరాల తరువాత మళ్లీ కనిపిస్తే అది మహిమాన్వితమైన సంఘటన కాక మరేమవుతుంది? శ్రీరంగం క్షేత్రంలో నిర్మించబడిన రంగనాథస్వామి ఆలయం అత్యంత విశిష్టమైనదిగా ప్రసిద్ధి చెందింది. అలాంటి ఈ క్షేత్రాన్ని ధ్వంసం చేయాలనే మతపరమైన ద్వేషంతో మాలిక్ కపూర్ తన అనుచరులతో కలిసి విరుచుకుపడ్డాడు. ఆలయాన్ని ఇష్టానుసారంగా ధ్వంసం చేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ఆ తరువాత అక్కడి స్థానికులకు గర్భాలయంలో అమ్మవారు కనిపించలేదు. దాడి జరిపిన వారికి ఆ విగ్రహం అవసరం లేదు ... అలా అని ధ్వంసం చేయబడిన ఆనవాళ్లు లేవు. మరి విగ్రహం ఏమైనట్టు? అని అంతా ఆలోచనలో పడ్డారు. చాలాకాలంపాటు వెతికి, అమ్మవారిది మరో విగ్రహాన్ని తయారు చేయించి అదే స్థానంలో ప్రతిష్ఠించారు. సంవత్సరాలు గడిచిపోయినా గతంలో గల అమ్మవారి మూర్తిని ఎవరూ మరిచిపోలేదు. ఆ తల్లిని దక్కించుకోలేక పోయినందుకు వాళ్లు బాధపడుతూ ఉండేవాళ్లు.
అలాంటి పరిస్థితుల్లోనే ... అదృశ్యమైపోయిన అమ్మవారి మూర్తి ఆలయ ప్రాంగణంలోనే కనిపించింది. ఏదో పనిమీద ఇక్కడి బిల్వ వృక్షం కింద తవ్వినప్పుడు అమ్మవారి ప్రతిమ బయటపడింది. దాంతో ఇక్కడి ప్రజల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అమ్మవారు కూడా తమని విడిచి ఉండలేక వచ్చేసిందని సంతోషపడ్డారు ... సంబరంగా ఆ తల్లి ప్రతిమను కూడా తీసుకువచ్చి గతంలోని గర్భాలయంలోనే ప్రతిష్ఠింపజేశారు. ఈ కారణంగానే ఇక్కడి గర్భాలయంలో నాచియార్ మూలమూర్తులు రెండు దర్శనమిస్తూ ఉంటాయి.