దేవుడే దిగివచ్చిన వేళ !
పురాణాలలో భక్తుడికి ... భగవంతుడికి మధ్య గల సంబంధం గురించి ఎవరైనా చెబుతుంటే అంతా ఆసక్తిగా వింటారు. ఆయా భక్తులను కాపాడటానికి భగవంతుడే వచ్చిన సందర్భాలను గురించి చెబుతుంటే ఆశ్చర్యపోతుంటారు. ఆ కాలం వేరు ... ఈ కాలం వేరని మరికొందరు తేలికగా తీసుకుంటూ ఉంటారు. కాలాన్ని బట్టి భగవంతుడి పట్ల ప్రజలు చూపే భక్తి శ్రద్ధలు తగ్గాయేమో గానీ, భగవంతుడు స్పందించే తీరు మాత్రం మారలేదు.
సాధారణ భక్తుల విషయంలోనూ భగవంతుడు తల్లడిల్లిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందుకు ఉదాహరణగా 'వారిజాల వేణుగోపాలస్వామి' వారి గుట్టపై జరిగిన సంఘటనను చెప్పుకోవచ్చు. నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలంలో ఈ క్షేత్రం అలరారుతోంది. ప్రాచీనకాలం నుంచి ఇక్కడి కొండ పైభాగంలో స్వామివారు కొలువై ఉన్నాడు.
చాలాకాలం క్రిందట ఆయనని దర్శించుకోవడానికి వెళ్లిన ఓ నిండు చూలాలు, కాలుజారిన కారణంగా అక్కడి నుంచి పడిపోయి చనిపోయిందట. ఈ సంఘటన స్వామివారిని సైతం బాధించాడంతో, భక్తులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో కొండ దిగువున గల ఓ ప్రదేశంలో కాలుమోపి దిగివచ్చాడు. ఆయన పాదం మోపిన ప్రదేశంలోనే ఇక్కడి కోనేరు ఏర్పడిందని అంటారు. సాక్షాత్తు కృష్ణ భగవానుడి పాదం నుంచి పుట్టింది కనుక ఈ కోనేరు మహిమాన్వితమైనదని అంటారు.
ఈ కోనేరులో నీటిని తీర్థంగా స్వీకరించడం వలన, సుదీర్ఘ కాలంగా వేధిస్తోన్న వ్యాధులు మటుమాయమవుతాయని చెబుతారు. నిండు చూలాలు మరణించడానికి ముందు ఉన్న ఆలయం ... ఆ తరువాత స్వామివారు వెలసిన ఆలయం ఈ క్షేత్రంలో కనిపిస్తుంటాయి. రెండు ప్రదేశాల్లోనూ స్వామివారు తనకు తానుగా ఆవిర్భవించడం ఈ క్షేత్రానికి గల ప్రాముఖ్యతగా భక్తులు భావిస్తుంటారు. ఈ జంట దేవాలయాలలో గల స్వామివారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తూ పునీతులవుతుంటారు.